విద్యార్ధిని కిడ్నాప్ ... ఆపై  అత్యాచారం

Intermediate girl kidnapped and raped.

05:50 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Intermediate girl kidnapped and raped.

మహిళలపై అత్యాచారాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. ఎక్కడో ఓ చోట దారుణం జరిగిపోతూనే వుంది. తాజాగా విశాఖ జిల్లాలోని గోపాలపట్నం పరిధిలో ఓ విద్యార్ధినిపై దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. తమ కూతురు కిడ్నాప్ గురించి విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీరా విషయం తెల్సి అంతా షాకింగ్ కి గురయ్యారు. మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు శుక్రవారం ఆమెను బస్టాండులో వదిలి పెట్టి వెళ్ళిపోయారు. బాలిక పరిస్థితి గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary

Intermediate girl kidnapped and raped in visakhapatnam.