ఇంటర్ మ్యాథ్స్ పేపర్ లీక్ 

intermediate maths question paper leak in telangana

01:56 PM ON 9th March, 2016 By Mirchi Vilas

intermediate maths question paper leak in telangana

ఎంతో పకడ్బందీగా జరగాల్సిన పరీక్షలు కొందరి స్వార్ధం కారణం గా అపహాస్యం గా మారుతున్నాయి . ప్రైవేటు కళాశాల యాజమాన్యం ర్యాంకుల కోసం తెగ ఆరాట పడుతుంటారు. వారి కక్కుర్తికి తోడు కొందరు అవినీతి అధికారుల కారణంగా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.

వివరాల్లోకి వెలితే నల్గొండ జిల్లాలో ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్ పేపర్(ఎ) లీక్ అయింది. పరీక్ష మొదలు కాకముందే ప్రశ్నాపత్రం 8:30 కే సోసల్ మీడియాలో చక్కర్లు కొట్టి సంచలనం రేపింది. ఆ ప్రశ్నాపత్రంలో జవాబులు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఈ రోజు ఉదయం 9 గంటలకి ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్ (పేపర్ ఏ) పరీక్ష ప్రారంబమైంది. నల్గొండ జిల్లాకి చెందిన అర్బన్ ప్రాంతాలలో సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడ, నల్గొండ లో ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ కధనంలో అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి . ప్రైవేటు యాజయాన్యం వారికి అధికారాలు తలొగ్గారని యువత తల్లి దండ్రులు వాపోతున్నారు.

ర్యాంకుల కోసం పిల్లల భవిషత్తు నాశనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ర్యాంకుల కోసం అడ్డదారులు తొక్కడం నేరమని పేరెంట్స్ వాపోతున్నారు. ఈ ప్రొసెస్లో కష్టపడి చదివే పిల్లలు చాలా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. విద్యార్ధి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు పేపర్ లీక్ వెనుక అధికారుల నిర్లక్ష్యదోరణి కనపడుతుందని వారు తెలియజేసారు. అంతేకాకుండా నిందులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు పేపర్ లీక్ చేసిన వారు ఎవరో తెలుసుకుని చర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు.

English summary

Mathematic A question paper was leaked 30 minutes before the exam began. Intermediate II year Maths 'A' question paper leaked in social media in Nalgonda district. While the exam was to begin at 9 am, the paper has leaked at 8.30 am.