వీక్షకులకు మధురానుభూతి మిగిల్చిన విన్యాసాలు

International fleet review acrobatics

11:36 AM ON 8th February, 2016 By Mirchi Vilas

International fleet review acrobatics

విశాఖ సాగర వాసులు ఓ అద్భుతాన్ని వీక్షించి, మధురానంద భరితులయ్యారు. మరపురాని ఘటనగా మదిలో నిలిచింది. సాగర తీరంలో  ఏర్పాటు చేసిన అంతర్జాతీయ నౌకా దళ ప్రదర్శన కు   ఆదివారం, సెలవుదినం కావటంతో నౌకాదళ విన్యాసాలను వీక్షించేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున సముద్రతీరానికి తరలివచ్చారు. నౌకా విన్యాసాల్లో జాతీయ, అంతర్జాతీయ యుద్ధ నౌకలను ప్రదర్శించారు. మిగ్‌-29 విమాన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లక్షలాది మంది  వీక్షకులను విన్యాసాలు కనువిందు చేసాయి.   ఈ విన్యాసాలను తిలకించేందుకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా అతిరథ మహారథులు తరలి వచ్చారు. ప్రత్యేక గ్యాలరీలో ఆశీనులైన ప్రధాని మోదీకి విన్యాసాల గురించి నౌకదళ అధికారులు వివరించారు. నౌకా విన్యాసాలను వీక్షించేందుకు మీ-సేవా కేంద్రాల ద్వారా 1.40లక్షల మంది పాస్‌లను పొందారు. వీరేకాకుండా మరో 17వేల మందికిపైగా వీఐపీ పాస్‌లు దక్కించుకున్నారు. సందర్శకుల కోసం విశాఖ ఆర్కే బీచ్‌లో ఏర్పాటు చేసిన అన్ని గ్యాలరీలు జనసంద్రంగా మారాయి. విన్యాసాలను నేరుగా చూడలేని వారికి నగరంలోని 50 థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శన ఏర్పాటు చేయడంతో వెండి తెరపై సాగర తీర విన్యాసాలను తిలకించిన వీక్షకులు సంతోషం వ్యక్తంచేశారు. 

1/11 Pages

English summary

International Fleet Review acrobatics attracted people in Vishakapatnam.Prime Minister Narendra Modi and President Of India Pranab Mukherji Was Attended as Chief Guests to this event