సాగర తీరాన అద్భుత పండుగ 'ఫ్లీట్‌ రివ్యూ'      

International Fleet Review Started In Vizag

10:21 AM ON 5th February, 2016 By Mirchi Vilas

International Fleet Review Started In Vizag

విశాఖ వేదికగా సాగరతీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శన గురువారం సాయంత్రం ఘనంగా ఆరంభమైంది. విశాఖలో ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌రివ్యూ 2006 ఫిబ్రవరి 13న నిర్వహించగా, ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పాల్గొన్నారు. ఇక విశాఖలో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష జరగడం ఇదే తొలిసారి. . 50కి పైగా దేశాల కు చెందిన 70కి పైగా యుద్ధనౌకలు ఇందులో విన్యాసాలు చేయనున్నాయి. వేలకొద్దీ విదేశీ నౌకాసిబ్బంది తరలి వచ్చారు. భారతీయ సంరదాయంలో అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూ ఓ వేదికగా నిలవనుంది. ఈ వేడుక గురువారం సాయంత్రం విశాఖలో అట్టహాసంగా ఆరంభమైంది... ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఐఎఫ్‌ఆర్‌ గ్రామాన్ని ఆవిష్కరించడం ద్వారా ఈ ఉత్సవాలను ఎపి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు... ఆపై నావికాదళాల నమూనా విన్యాసాలు ఆర్కే బీచ్‌ వేదికగా జరిగాయి... ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనేందుకు సర్వసైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దేశ ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం రాత్రి నగరానికి వస్తారు.

జిల్లా వాసుల కోసం వెండి తెరపై ....

ఇక ఫ్లీట్ రివ్యూలో కీలకంగా ఈనెల 7న జరిగే ప్రధాన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉచితంగా వీక్షించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి సాగరతీరంలో ప్రారంభమయ్యే నౌకాదళాల కవాతు, యుద్ధ విమానాల విన్యాసాలు, నౌకల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా నగర ప్రజలను ఆశ్చర్యపరిచే విధంగా వెలిగే బాణసంచాను ప్రత్యక్ష ప్రసారం చేయ దానికి రంగం సిద్ధం చేస్తోంది. విశాఖ నగరంలో 22, ఐనాక్స్‌లు 14, గాజువాక ప్రాంతంలో 13, గోపాలపట్నంలో 7, తగరపువలసలో 4, అనకాపల్లిలో 7 థియేటర్లు ఉండగా దాదాపు అన్ని థియేటర్లలో ఐఎఫ్‌ఆర్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ఇందుకోసం ఆయా థియేటర్లలో శాటిలైట్‌కు సంబంధించిన కేబుల్‌ తీగలు కూడా అమరుస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారాలు చూసేందుకు శనివారం ఉదయం 9 గంటల నుంచి థియేటర్ల వద్ద టిక్కెట్లను పంపిణీ చేస్తామని, అయితే వాటిని తీసుకోవడానికి ఆధార్‌ కార్డు తెచ్చుకోవాలని, ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి.. విన్యాసాల ప్రదర్శనకు పలు థియేటర్లు సినిమా ప్రదర్శనల వేళలు మార్చుకోవడంతో పాటు మరికొన్ని చోట్ల ఈవినింగ్ షో లను రద్దు చేసుకుంటున్నాయి. ఇక మనదేశ చరిత్రలో. ఇప్పటివరకూ 10 ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌రివ్యూలు జరిగాయి. 1953లో ముంబయిలో జరిగిన తొలి ప్రెసిడెన్షియల్‌ ఫ్లీట్‌రివ్యూలో ఆనాటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. 2006 తర్వాత విశాఖలో జరుగుతోంది. అయితే అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష మాత్రం విశాఖలో తొలిసారి జరుగుతోంది.

English summary

Indian Navy's International Fleet review was started grandly in Vishakapatnam.In the first day International warships exhibition was conducted and this was attracted by many people in Vizag.This main event to be conducted from 7th February in Vishakapatnam.