కైట్ ఫెస్టివల్ కి భారీ ఏర్పాట్లు

International kite festival first time in Telangana

12:48 PM ON 13th January, 2016 By Mirchi Vilas

International kite festival first time in Telangana

సంక్రాంతి అనగానే పలు సంప్రదాయ వంటకాలు , ఆటలు , వేడుకలు గుర్తొస్తాయి. ముఖ్యంగా పతంగుల ను ఎగురవేయడం కూడా సంక్రాంతి సందడి లో భాగం. రాష్ట్ర విభజన నేపధ్యంలో తెలంగాణాలో తొలిసారి అంతర్జాతీయస్థాయిలో పతంగుల పండుగను నిర్వహించబోతున్నారు. ఈ నెల 14, 15వ తేదీల్లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని ఆగాఖాన్‌ అకాడమీలో పతంగుల పండుగ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేసారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తెలంగాణ అంతర్జాతీయ పతంగుల పండుగను పదేళ్లలో ప్రపంచంలోని ప్రముఖ పతంగుల పండుగల్లో ఒకటిగా చేస్తామని ఆయన చెప్పారు. అలాగే ఐదేళ్లలో అహ్మదాబాద్‌కు దీటుగా తెలంగాణా కైట్ ఫెస్టివల్ ని తీసుకెళ్తామని పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అంటున్నారు.

English summary

International kite festival first time in Telangana