మాజీ మోడల్ సంగీత ఆస్తుల సీజ్

International Red Sandal smuggler Sangeeta Chatterjee

11:21 AM ON 20th June, 2016 By Mirchi Vilas

International Red Sandal smuggler Sangeeta Chatterjee

దొంగలు, స్మగ్లర్ల పనే బాగుందని అందులో దూరిన ఇంటర్నేషనల్ రెడ్ శాండల్ స్మగ్లర్, మాజీ మోడల్, మాజీ ఎయిర్ హోస్టెస్ సంగీత చటర్జీకి చెందిన కోటి రూపాయలకు పైగా విలువైన బంగారు, వెండి నగలు, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ ను చిత్తూరు పోలీసులు గత ఏడాది అరెస్టు చేసి అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో అతని రెండో భార్య అయిన సంగీత కోట్లాది విలువైన ఎర్రచందనాన్ని విదేశాలకు దొంగ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతో కోల్ కతాలోని సంగీత బ్యాంకు లాకర్లను ఓపెన్ చేసి 2.5 కిలోల బంగారు నగలు, వెండి వస్తువులు, విదేశాలకు చెందిన 150 నాణేలు, 9 సెల్ ఫోన్లు, ఓ ల్యాప్ టాప్, రూ.60 లక్షల విలువ చేసే ఆస్తుల పత్రాలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చూడండి: హనుమంతుడి గురించి తెలీని నిజాలు

ఇది కూడా చూడండి: టాలీవుడ్ లో అచ్చం ఒకలాగే ఉండే సెలబ్రిటీస్

ఇది కూడా చూడండి: రామాయణ కాలం నాటి లంక లో అబ్బురపరిచే అంశాలు

English summary

International Red Sandal smuggler Sangeeta Chatterjee arrested in Kolkata.