ఇంటెక్స్‌ నుంచి ఆక్వా క్రేజ్, ఆక్వా లైట్

Intex Aqua Craze, Aqua Lite Smnartphones

11:13 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Intex Aqua Craze, Aqua Lite Smnartphones

ప్రముఖ దేశీయ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ ఇంటెక్స్‌ మరో రెండు కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేసింది. ఆక్వా సిరీస్ లో ఆక్వా క్రేజ్‌, ఆక్వా లైట్‌ పేరుతో ఈ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఆక్వా క్రేజ్ ధర రూ.6,190కాగా, ఆక్వా లైట్ ధర రూ.3,199. త్వరలోనే ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

ఆక్వా క్రేజ్‌ ఫీచర్లు..

5 అంగుళాల డిస్‌ప్లే, 5.1 ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 1 గిగా హెడ్జ్‌ ప్రొసెసర్‌, 1 జీబీ ర్యామ్‌, 4జీ సపోర్టింగ్‌, 8 మెగాపిక్సల్‌ వెనుక కెమెరా, 2 మెగాపిక్సల్‌ ముందు కెమెరా, 8 జీబీ ఇంటర్నల్‌ మెమరీ,

ఆక్వా లైట్‌ ఫీచర్లు..

4 అంగుళాల డిస్‌ప్లే, 5.1 ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 1.3 గిగా హెడ్జ్‌ ప్రొసెసర్‌, 4జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 2 మెగాపిక్సల్‌ ముందు కెమెరా, 2 మెగాపిక్సల్‌ వెనుక కెమెరా

English summary