ఇంటెక్స్ నుంచి క్లౌడ్ బ్రీజ్ స్మార్ట్‌ఫోన్

Intex Cloud Breeze Smartphone

12:51 PM ON 7th March, 2016 By Mirchi Vilas

Intex Cloud Breeze Smartphone

ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇంటెక్స్ తాజాగా ఓ కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. క్లౌడ్ సిరీస్ లో క్లౌడ్ బ్రీజ్ పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. దీని ధర రూ.3,999. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఆన్ లైన్ వెబ్ సైట్లతో వినియోగదారులకు లభిస్తోంది. అతి తక్కువ ధరకే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్న ఫోన్ ఇదే కావడం గమనార్హం.

క్లౌడ్ బ్రీజ్ ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ డిస్‌ప్లే, 480 X 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.2 జీహెచ్‌జడ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5 మెగా పిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీ

English summary

Intex company launched a new smartphone called Intex Cloud Breeze.This smartphone comes with the key features like 5.00-inch Display,1GB RAM,5 megapixel Rear Camera, 2-megapixel Front Camera