ఇంటెక్స్‌ ‘ఫిట్ రిస్ట్’ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌

Intex Fit Rist Fitness Band

10:33 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Intex Fit Rist Fitness Band

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్‌ మరో కొత్త ప్రొడక్ట్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఫిట్‌రిస్ట్‌ పేరుతో ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ను విడుదల చేసింది. ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ ధర రూ.999. ఈ బ్యాండ్‌ను ఈ-కామర్స్‌ పోర్టల్‌ స్నాప్‌డీల్‌ ద్వారా కొనుక్కోవచ్చు. ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించి వివిధ వివరాలను తెలియజేస్తుంది. స్టెప్‌ మానిటరింగ్‌, ఎంత దూరం నడిచామో కొలిచే సాధనం, కేలరీ కౌంట్‌, స్లీప్‌ ట్రాకర్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ బ్యాండ్‌ ఆండ్రాయిడ్‌ 4.3 ఓఎస్‌, ఐఎస్‌ఎస్‌ 7 నుంచి తర్వాతి వెర్షన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న ఫోన్లతో అనుసంధానమవుతుంది. ఫిట్‌ రిస్ట్‌లో వాటర్‌ రెసిస్టెంట్‌ సదుపాయం కూడా ఉంది. ఈ ఫిట్ నెస్ బ్యాండ్ డార్క్‌ బ్లూ, తెలుపు రెండు రంగుల్లో అందుబాటులో ఉంది.

English summary

Intex copmany launched a new fitness brand named FitRist Fitness Band with OLED Display.The price of this band was Rs.999 and it comes with the keyfeatures like 0.86-inch (96×32 pixels) OLED display,Bluetooth 4.0,Weight: 21 grams,Sensors: 3-axis accelerometer,Water-Resistant,Splash Proof