ఇంటెక్స్ నుంచి మరో బడ్జెట్‌ 4జీ ఫోన్‌

Intex Launched Aqua Star 4G Smart Phone

03:22 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Intex Launched Aqua Star 4G Smart Phone

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఇంటెక్స్‌ ఆక్వా సిరీస్‌లో మరో బడ్జెట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంటెక్స్‌ ఆక్వా స్టార్‌ 4జీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ ధర రూ.6,499. ఫొటోలు, బ్రౌజింగ్‌, స్ట్రీమింగ్‌లపై డేటా వినియోగం 50 శాతం వరకు తగ్గించుకునే ఐడేటా సేవర్‌ ఫీచర్‌ ఈ ఫోన్‌ స్పెషాలిటీ. ఓపెరా మ్యాక్స్‌ సంస్థ ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్, 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతర్గత మెమరీని 32 జీబీ వరుకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, వైట్, గ్రే కలర్స్ లో లభ్యమవుతోంది.

English summary

Intex mobile company launched a new smart phone called Intex Aqua Star 4G in India. This phone comes with 5 inch display, 5.1 android lollipop,8 Gb internal memory, 1GB Ram. The price of this smart phone was Rs. 6,499