ఇంటెక్స్‌ నుంచి క్లౌడ్‌ ఛాంప్‌

Intex Launched Cloud Champ Smart Phone

07:08 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Intex Launched Cloud Champ Smart Phone

దేశీయ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఇంటెక్స్‌ మరో బడ్జెట్‌ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘క్లౌడ్‌ ఛాంప్‌’ పేరుతో 3జీ సపోర్ట్‌ ఉన్న ఈ ఫోన్‌ ధరను రూ.3,999గా నిర్ణయించింది. ఈ ఫోన్‌ మోడల్‌ను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో 4.50 అంగుళాల తాకే తెర, 480 X 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 గిగాహెడ్జ్‌ డ్యుయల్ కోర్ ప్రాసెసర్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 2 ఎంపీ ముందు కెమెరా, 5 ఎంపీ వెనుక కెమెరా, ఆండ్రాయిడ్‌ 4.4.2 కిట్ క్యాట్, డ్యుయల్‌ సిమ్‌, 3జీ, 1700 ఎంఏహెచ్‌ బ్యాటరీ కెపాసిటీ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

English summary

Intex company launched a new smart phone called Intex Cloud Champ.The Intex Cloud Champ runs Android 4.4.2 and is powered by a 1700mAh removable battery. It measures 136.00 x 67.50 x 8.70 (height x width x thickness) and weighs 133.00 grams.