ఇంటెక్స్ నుంచి ఆక్వా జెన్‌ఎక్స్

Intex Launched New Intex Aqua GenX Smart Phone

06:50 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Intex Launched New Intex Aqua GenX Smart Phone

ప్రముఖ దేశీల ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ ఇంటెక్స్ తన కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఆక్వా జెన్‌ఎక్స్ పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. రూ.13,299 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది. 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకత. అంతేకాక.. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ వెర్షన్ తో పని చేసే ఈ మొబైల్‌కు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలోకు అప్‌డేట్ అందిస్తామని ఇంటెక్స్ చెపుతోంది. అత్యాధునిక డ్రాగన్ టెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్ సౌకర్యం ఇందులో ఉంది. 1.3 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2800 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్‌టీఈ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

English summary

Intex company launched its new Aqua Gen-X smart phone in India.The phone comes with a 5.50-inch touchscreen display with a resolution of 1080 pixels by 1920 pixels