ఇంటెక్స్ క్లౌడ్ ఫ్లాష్ స్మార్ట్‌ఫోన్ విడుదల

Intex New Smart Phone Released

06:21 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Intex New Smart Phone Released

స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్ క్లౌడ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇంటెక్స్ క్లౌడ్ ఫ్లాష్ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ధరను రూ.9,999గా ప్రకటించింది. ఈ బడ్జెట్ ఫోన్‌లో 4జీ సదుపాయం కూడా ఉంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. 5 అంగుళాల హెచ్ డీ తెరతో 2జీబీ ర్యామ్ తో పాటు 1.3 గిగాహెడ్జ్ ప్రాసెసర్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 5ఎంపీ ముందు కెమెరా.. 13ఎంపీ వెనుక కెమెరా ఉంది. 16జీబీ ఇంటర్నల్ మెమొరీతో ఉన్న ఈ మొబైల్ లో కావాలంటే మెమొరీని పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. ఆండ్రాయిడ్ 5.1..డ్యుయల్ సిమ్ తో పని చేసే ఈ ఫోన్ 4జీని కూడా సపోర్ట్ చేస్తుంది.

English summary

Intex released its new smart phone called intex cloud flash.This phone comes with the features like 4G ,2Gb RAM etc