డౌన్ లోడ్ కు రెడీ అయిన ఐఓఎస్ 9.2.1

iOS 9.2.1 Version Update

01:08 PM ON 26th January, 2016 By Mirchi Vilas

iOS 9.2.1 Version Update

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీదారు యాపిల్ తన ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సరికొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లోనే ఐఓఎస్ 9.2 విడుదల కాగా దానికి మరిన్ని హంగులతో ఐఓఎస్ 9.2.1 వెర్షన్‌ను రీలీజ్ చేసింది. ఐఓఎస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని సెక్యూరిటీ లూప్ హోల్స్‌కు ప్యాచింగ్‌గా యాపిల్ ఈ అప్‌డేట్‌ను విడుదల చేసింది. దీని ద్వారా డివైస్‌కు మరింత సెక్యూరిటీ లభిస్తుందని యాపిల్ ప్రతినిధులు తెలియజేశారు. ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ డివైస్‌లకు ఈ నూతన అప్‌డేట్ లభిస్తోందని, హ్యాకర్ల నుంచి వచ్చే ముప్పును తగ్గించేందుకు కూడా ఈ అప్‌డేట్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు. తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు నాణ్యమైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని, అదే తమ సంస్థ లక్ష్యమని యాపిల్ ప్రతినిధులు ఈ అప్‌డేట్ రిలీజ్ సందర్భంగా పేర్కొన్నారు.

English summary

Apple company has released iOS 9.2.1 operating system update to its users with some extra features and latest attracting feqatures