ఐప్యాడ్‌ ప్రో విడుదల.. ధర రూ.67,900

Ipad Pro Launched In India

06:31 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Ipad Pro Launched In India

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ ఐప్యాడ్‌ప్రో పేరిట కొత్త టాబ్లెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.67,900కు ఈ టాబ్లెట్ వినియోగదారులకు లభిస్తోంది. ఇందులో 12.9 ఇంచ్ డిస్‌ప్లే, 2732X2048 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 1.2 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఐఓఎస్ 9, యాపిల్ ఎ9ఎక్స్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 32 జీబీ మెమొరీ, వైఫై సదుపాయం ఉన్న ఐప్యాడ్‌ ప్రో మోడల్‌ ధర రూ.67,900 ఉండగా, 128 జీబీ మెమొరీ, వైఫై సదుపాయం గల ఐప్యాడ్‌ ప్రో ధర రూ.79,900గా, 128 జీబీ, వైఫై, 4జీ సదుపాయం గల ఐప్యాడ్‌ ప్రో ధర రూ.91,900గా ఉంది.

English summary

Apple company launched its new ipad pro tablet in India. This ipad pro tablet will be available in three variants