ఐఫోన్ 6సి వచ్చేస్తోంది..

Iphone 6C To Release In 2016

05:00 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Iphone 6C To Release In 2016

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ అయిన యాపిల్ తన సరికొత్త ఐఫోన్ 6 మోడల్స్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టగా.. అవి వినియోగదారులను అమితంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఇదే సిరీస్‌లో మరో నూతన ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది యాపిల్. 'ఐఫోన్ 6సి' పేరిట విడుదల కానున్న ఈ ఫోన్ జనవరిలో మార్కెట్‌లోకి రానుంది. ఫిబ్రవరి నుంచి వినియోగదారులకు లభ్యం కానుంది. 5సీలో ఉన్న కొన్ని మైనస్ లను సరిచేసి ఈ కొత్త ఫోన్ ను రూపొందించింది యాపిల్. అయితే 6సీ కూడా 5సీ మాదిరే రకరకాల రంగుల్లో లభ్యం కానుంది. ఇంతకు ముందుకు ప్లాస్టిక్ తో రూపొందించినా.. ఇప్పుడు పూర్తిగా మెటల్ బాడీతో ఆకట్టుకోనుంది. 2016 ప్రథమార్థంలో భారీగా 6సీని మార్కెట్లోకి తేవాలని యాపిల్ ప్లాన్ చేస్తోంది.

4 ఇంచ్ డిస్‌ప్లే, ఫేస్‌టైం హెచ్‌డీ కెమెరా, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.1, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అత్యాధునిక ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. అయితే యాపిల్ 6ఎస్, 6ఎస్ ప్లస్ లో ఉన్నటు వంటి త్రీడి టచ్ టెక్నాలజీని మాత్రం ఇందులో వినియోగించడం లేదు. దీనిని యాపిల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా మార్కెట్ లోకి తేవాలని ప్రణాళికలు రచిస్తోంది యాపిల్. ఈ ఫోన్ కోసం యాపిల్ సంస్థ ప్రత్యేకంగా ఓ 'చార్జింగ్ డాక్‌'ను రూపొందిస్తోంది. ఈ డాక్ ధర రూ.6,600గా ఉండబోతుందని, అయితే, 'ఐఫోన్ 6సి' ధరను మాత్రం త్వరలోనే వెల్లడిస్తామని ఆ సంస్థ పేర్కొంది.

English summary

Worlds Biggest Smart Phones manufacturing company Apple releases its new phone called iphone 6c in different colors. This phone is to be released in the first half of 2016