మతిపోగొట్టే ఫీచర్లతో ఐఫోన్‌ 7

Iphone 7 Stunning Features

04:25 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Iphone 7 Stunning Features

యాపిల్ ఐఫోన్‌.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న స్మార్ట్ ఫోన్ ఇదే. కొత్త టెక్నాలజీ.. సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది ఐఫోన్‌. అందుకే ఈ ఫోన్ కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టెందుకైనా చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే విడుదలైన ఐఫోన్ 4, 4ఎస్, 5, 5ఎస్, 5సీ, 6, 6 ప్లస్ మోడల్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇదే దారిలో త్వరలోనే ఐఫోన్ 7 రానుంది. ఈ ఫోన్‌కు సంబంధించి ఒక్కో ఫీచర్ ను సంస్థ వెల్లడిస్తూ వస్తోంది. తాజాగా వాటర్‌ప్రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ లాంటి అధునాతన సదుపాయాలతో ఐఫోన్‌ 7ను విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటర్‌ రెసిస్టెంట్‌ డిస్‌ప్లేతో పాటు.. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్‌లను కూడా ఈ ఫోన్‌తో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో పాటు నాయిస్‌ క్యాన్సలేషన్‌ టెక్నాలజీని కూడా ఫోన్లతో ఇన్‌బిల్ట్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. పాత ఐఫోన్లకు కూడా ఉపయోగపడేలాగా కొత్త ఐఫోన్లతోపాటు అడాప్టర్లను అందజేస్తారని తెల్సింది. అయితే ఈ సరికొత్త ఫీచర్లు కలిగిన ఐఫోన్ 7 సిరీస్ ఎప్పుడు మార్కెట్‌లోకి వచ్చేది కంపెనీ వెల్లడించలేదు.

English summary

Apple will do away with the 3.5mm headphone jack on the iPhone 7, and release wireless earphones alongside. Now, a few more details have been reported regarding the headphones, water-resistant design, and wireless charging.