విమానంలో పేలిన ఐఫోన్

iPhone Blast In Alaska Airlines Flight

10:30 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

iPhone Blast In Alaska Airlines Flight

అవును, మొబైల్ ఫోన్ మాట్లాడుకుంటే, సినిమా వీక్షిస్తే, అబ్బో బానే వుంటుంది. పేలితేనే వుంటుంది అసలైన తంటా ... సరిగ్గా అదే జరిగింది ... పైగా విమానంలో .... ఒక్కసారిగా ఐఫోన్‌ పేలిపోవడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన అలాస్కా ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో చోటుచేసుకుంది. ఓసారి వివరాల్లోకెళితే.. ఆనాక్రెయిల్‌ అనే యువతి వాషింగ్టన్‌ నుంచి హోనులులుకి వెళుతోంది.

విమానం బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత ఆనాకి ఏమీ తోచక తన ఐఫోన్‌లో సినిమా చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటికే ఫోన్‌ ఉన్నట్టుండిపేలిపోయి మంటలు రావడంతో ఆమె భయపడి ఫోన్‌ని పక్క సీటు కిందకి విసిరేసింది. మంటలు స్వల్పంగా ఎగిసిపడుతుండటంతో ప్రయాణికులకు గుండె ఆగినంతపనైంది. వారి అరుపులు విన్న విమాన సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు యత్నించారు. ఫెడరల్‌ ఏవియేషన్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా అదృష్టం కొద్దీ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఫోన్ బాబులూ జాగ్రత్త ...

English summary

A traveler was travelling in Alaska Airlines flight and watching movie on her iPhone and suddenly that iPhone catches fire in the Aeroplane. Later the Airlines Staff stopped the fire with fire extinguishers.