మార్చి 15న ఐఫోన్ 5ఎస్‌ఈ రిలీజ్

iPhone5SE To Release On March 5th

09:26 AM ON 4th February, 2016 By Mirchi Vilas

iPhone5SE To Release On March 5th

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ యాపిల్ తన కొత్త ఉత్పత్తులను మార్చి 15న మార్కెట్ లోకి తీసుకురానుంది. ఐఫోన్ సిరీస్‌లో భాగంగా నూతన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 5ఎస్‌ఈని తీసుకురానుంది. దీంతోపాటు ఐప్యాడ్ ఎయిర్ 3, కొత్త వాచ్ మోడల్స్‌ను కూడా ఆవిష్కరించనుంది. ఈ ఏడాది జరగనున్న తన తొలి ఈవెంట్ సందర్భంగా ఆయా డివైస్‌లను విడుదల చేసేందుకు యాపిల్ ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం వస్తున్న రూమర్ల ప్రకారం ఐఫోన్ 5ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను 4 ఇంచుల డిస్‌ప్లేతో, 16/64 జీబీ వేరియెంట్లలో విడుదల చేయనున్నారు. దీంతోపాటు ఇందులో యాపిల్ ఎం9 ప్రాసెసర్, సిరి ఆల్వేస్ ఆన్ ఫీచర్ సపోర్ట్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా వంటి హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లను యూజర్లకు అందించనున్నారు. అలాగే ఐప్యాడ్ ఎయిర్ 2కు సక్సెసర్ మోడల్‌గా ఐప్యాడ్ ఎయిర్ 3ని ఆవిష్కరించనున్నారు. దీంట్లో 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే, 3డీ టచ్ సామర్థ్యం, నాలుగు స్పీకర్లు, స్మార్ట్ కనెక్టర్ వంటి ఫీచర్లను ఏర్పాటు చేయనున్నారు. ఐప్యాడ్ ఎయిర్ 2 కన్నా ఐప్యాడ్ ఎయిర్ 3ని 0.05 ఎంఎం మందంగా, 0.1 ఎంఎం వెడల్పుగా తీర్చిదిద్దుతున్నారు. కాగా మార్చి 15న జరగనున్న ఆ ఈవెంట్‌లో యాపిల్ వాచ్ 2 నూతన మోడల్స్‌పై యాపిల్ ఓ ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ఈ వాచ్‌లను ఐఫోన్ 7తోపాటుగా మార్కెట్‌లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary

Apple Company to release a new smartphone called iPhone 5SE with 4 inch display,16/64 GB memory Variants,8 Mega Pixel Rear Camera,5 Mega Pixel Front Camera