తగ్గుతున్న ఐఫోన్‌ ధర

iPhone6s price decreases in India

11:29 AM ON 13th February, 2016 By Mirchi Vilas

iPhone6s price decreases in India

యాపిల్ ఐఫోన్ల ధరలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఐ-ఫోన్6 ఎస్‌ ధర గణనీయంగా తగ్గింది. తాజాగా ఈ మోడల్‌ ధర 27 శాతం పడిపోయింది. ప్రస్తుతం రూ. 45 వేలకే కొన్ని ఈ కామర్స్ సైట్లలో లభిస్తోంది. యాపిల్ కంపెనీ 64 జీబీ మోడల్ ఐఫోన్‌ 6ఎస్‌ను గత ఏడాది అక్టోబర్‌లో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. లాంచ్‌ సమయంలో దీని ధర రూ. 62 వేలు. ఇప్పుడు గోల్డ్ కలర్ ఐఫోన్‌ 6ఎస్‌ మోడల్ రూ. 44,799లకే అమెజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అంటే ఈ మోడల్‌ ధర 27 శాతం తగ్గింది. ఇక 64 జీబీ గ్రే కలర్ మోడల్ ధర మొదట్లో రూ. 72 వేలు ఉండగా.. ఇప్పుడు అది రూ. 57,699కే లభిస్తోంది. పేటీఎంలోనూ ఐఫోన్‌ 6ఎస్‌ తక్కువ ధరకే లభిస్తోంది. 6ఎస్‌ 128 జీబీ మోడల్ వాస్తవ ధర రూ. 82 వేలు కాగా.. 20 శాతం డిస్కౌంట్‌తో రూ. 65,490కే ఈ ఫోన్‌ లభిస్తోంది. పేటీఎంలో ఐఫోన్‌ 6ఎస్‌ 64 జీబీ బేస్ మోడల్‌ రూ. 66,489కి లభిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఇదే మోడల్‌ రూ. 49,999కి లభిస్తోంది.

English summary

Apple iPhone 6s price has fallen by 27 percent in India.This smartphone was available in E-commerce websites for low cost.Previously iPhone 6s 64GB model price was 62 thousand and now it will be available for only Rs.44,799 in leading E-commerce webistes in India