లైఫై సపోర్ట్‌ ఫీచర్ తో ఐఫోన్ 7..

iPhone7 To Launch With Lifi Feature

01:22 PM ON 26th January, 2016 By Mirchi Vilas

iPhone7 To Launch With Lifi Feature

లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడు ముందుండే సంస్థ యాపిల్. ఇదే కోవలో ఇప్పుడు త్వరలో యాపిల్ విడుదల చేయనున్న సరికొత్త ఫోన్ ఐఫోన్ 7లో అత్యాధునిక లైఫై సపోర్ట్ అందించనున్నట్టు తెలిసింది. వైఫైకి కొన్ని వందల రెట్ల వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలిగే శక్తి ఉన్న లైఫైని యాపిల్ తన యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. యాపిల్ కు చెందిన ఐఓఎస్ 9.3 బీటా ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లో లైఫై సపోర్ట్‌కు సంబంధించిన ఓ టెక్ట్స్ కోడ్ చూచాయగా కనిపించడంతో ఇప్పుడు ఈ టాపిక్ టెక్ ప్రపంచంలో హాట్ హాట్‌గా మారింది. ఒకవేళ ఈ టెక్నాలజీని యాపిల్ తీసుకువస్తే సదరు సాంకేతికతతో విడుదలయ్యే మొదటి ఫోన్‌గా ఐఫోన్ 7 రికార్డు సృష్టించడం ఖాయం. అయితే యాపిల్ లైఫై సపోర్ట్‌ని అందించడమే కాక, ప్రస్తుతం ఐఫోన్లలో ఉన్న 3.5 ఎంఎం ఆడియో జాక్‌ను ఐఫోన్ 7లో తీసివేయనుందని కూడా సమాచారం. ఆ జాక్‌ను తీసేవేసే విషయంపై ఇటీవలే ఐఫోన్ యూజర్ల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. కాగా యాపిల్ సంస్థ ఏది ఏమైనా తాను తీసుకున్న నిర్ణయంతోనే ముందుకు సాగనుందని తెలుస్తోంది.

English summary

World famous popular smart phone company Apple to launch iPhone7 . This iPhone 7 comes with latest features and a new came to know that Lifi feature was also included in Apple iPhone7