ధోనీ, రైనా @ 12.5 కోట్లు

IPL 2016 Auction

05:43 PM ON 15th December, 2015 By Mirchi Vilas

IPL 2016 Auction

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో ఊహించిందే జరిగింది . అందరూ ఉహించినట్లు గానే ధోని ఐపీఎల్ 2016 వేలంలో అత్యధిక ధర పలికాడు. ఈ రోజు కొత్త జట్లకు జరిగిన ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) 2016 డ్రాఫ్టింగ్‌లో భాగంగా జరిగిన వేలంలో భారత్‌ వన్డే క్రికెట్‌ టీం కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనిని ఆత్యధికంగా 12.5 కోట్లుకు కొత్త ప్రాంఛైజీ పూణే దక్కించకుంది. అనంతరం సురేష్‌ రైనా కూడా అదే 12.5 కోట్లు ధరకు రాజ్‌ కోట్‌ ఫ్రాంఛైజీ దక్కించుకుంది.

చెన్నైసూపర్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు రెండేళ్ళ నిషేదానికి గురికావడంతో వాటి స్ధానంలో వచ్చిన పూణే, రాజ్‌కోట్‌ ఫ్రాంఛైజీలు మంగళవారం చెరో 5 గురు ఆటగాళ్ళను ఎంపిక చేసుకునే వేలం పూర్తి అయ్యింది. సంజీవ్ గోయెంకాకు చెందిన న్యూరైజింగ్ కంపెనీ రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియలో పుణేను గెలిచింది. రాజ్‌కోట్‌ను కొనుక్కున్న ఇంటెక్స్ మొబైల్స్ సొంతం చేసుకుంది. తొలి ఆటగాడిని పుణే ఎంచుకోగా, రెండో క్రికెటర్‌ను రాజ్‌కోట్ దక్కించుకుంది. ఇంతకు ముందు చెన్నై, రాజస్ధాన్‌ జట్లుకు ఆడిన 50 మందిఅందుబాటులో ఉంచారు. వారిలో ఒక్కక్క టీం చెరో ఐదుగురిని మాత్రమే ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. ఇలా పది మంది ఆటగాళ్ళు ఎంపిక పూర్తి అవ్వగా మిగిలిన 40 క్రికెటర్లకు వచ్చే యేడాది ఫిబ్రవరిలో వేలం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి లో నిర్వహించే వేలంలో వీరితో పాటు మిగత క్రికెటర్లు అందరూ అందుబాటలో ఉంటారు.

ఇక ఈ రోజు జరిగిన వేలంలో ధోని (12.5కోట్లు) అజింక్యరహానే (9.5కోట్లు), రవిచంద్రన్‌అశ్విన్‌ (7.5కోట్లు) స్టీవ్‌స్మీత్‌ (5.5కోట్లు), డుప్లేసిన్‌ (4 కోట్లు) వంటి ఆటగాళ్ళును పూణె జట్టు దక్కించుకుంది. సురేష్‌రైనా (12కోట్లు), రవింద్రజడేజా(9.5కోట్లు) మెకల్లమ్‌(7.5కోట్లు), జేమ్స్‌ఫాల్క్‌నర్‌(5.5కోట్లు) డ్వేన్‌బ్రోవో(4 కోట్లు) వంటి ఆటగాళ్ళను రాజ్‌కోట్‌ ఫ్రాంఛైజీ దక్కించుకుంది.

English summary

Today In the IPL 2016 auction was conducted in this auction Pune team buyed Dhoni for 12.5 crores and SDuresh Raina Was buyed by Rajkot Franchise For Same Ammount as Dhoni