యూవీ@7 కోట్లు.. వాట్సన్@9.5 కోట్లు.. నెగి@8.5 కోట్లు

IPL Auction 2016

06:14 PM ON 6th February, 2016 By Mirchi Vilas

IPL Auction 2016

ఐపీఎల్‌-9లో ఫ్రాంచైజీల తరపున ఆడే ఆటగాళ్ల ఎంపిక కోసం బెంగళూరులో ఆక్షన్ నిర్వహించారు. మరో రెండు నెలల్లో ఐపీఎల్‌ సీజన్‌ మొదలవనున్న నేపథ్యంలో శనివారం నిర్వహించిన వేలంలో పలువురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వేలంలో మొత్తం 351 మంది ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చారు. అయితే అత్యధిక మొత్తం పలికింది మాత్రం ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్. అతనిని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.9.5 కోట్లతో కొనుగోలు చేసింది. భారత క్రికెటర్లలో అత్యధిక రెటు పలికింది మాత్రం పవన్ నెగినే. అతడిని ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ. 8.5 కోట్లకు దక్కించుకుంది. నెగి టీ20 వరల్ కప్ టీమ్ లోకి అనూహ్యాంగా సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. అన్ క్యాప్డ్ ఆటగాళ్లలో ఎక్కువ మొత్తం దక్కించుకున్న ఆటగాడిగా నెగి రికార్డు క్రియేట్ చేశాడు. మరోవైపు గతేడాది ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ రూ.16 కోట్లకు కొనుగోలు చేసిన టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్‌ను ఈ సారి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ దక్కించుకుంది. అయితే గత ఏడాది భారీ మొత్తం పలికిన యూవీ ఈసారి రూ.7 కోట్లకే సన్ రైజర్స్ కు దక్కడం విశేషం. యూవీ కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చివరి వరకూ పోటిపడ్డాయి. ఇంగ్లాండ్‌ స్టార్ కెవిన్‌ పీటర్సన్‌ను రూ. 3.5 కోట్లకు, భారత పేసర్ ఇషాంత్‌ శర్మని రూ.3.8 కోట్లకు పుణె రైజింగ్‌ సూపర్‌జైంట్స్‌ దక్కించుకుంది. ఆశిష్‌ నెహ్రాను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ. 5.50 కోట్లకు కొనుగోలు చేసింది. నెహ్రా కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చివరి వరకు పోటీపడ్డాయి. డ్వేన్‌ స్మిత్‌ను రూ.2.3 కోట్లకు, డేల్‌ స్టెయిన్‌ను రూ.2.3 కోట్లకు గుజరాత్‌ లయన్స్‌ సొంతం చేసుకుంది. కాగా ఆస్ట్రేలియా టీ20 కెప్లెన్ ఆరోన్‌ ఫించ్‌ ను గుజరాత్ లయన్స్ దక్కించుకుంది. మోహిత్ శర్మను కింగ్స్ లెవన్ పంజాబ్ రూ. 6.5 కోట్లకు దక్కించుకుంది.

English summary

Today IPL 2016 auction was started today and Pawan Negi Becomes Most Expensive Indian player he was Goes to Delhi Daredevils for Rs 8.5 Crore .The highest paid player in IPL 2016 Auction was Shane Watson.Shane watson was bought by Royal Challengers Bangalore for Rs 9.5 Crore.