ఐపీఎల్ వేలంలో 'యువీ' కి షాక్‌!!

IPL gave shock to Yuvaraj Singh

04:27 PM ON 26th January, 2016 By Mirchi Vilas

IPL gave shock to Yuvaraj Singh

ఫిబ్రవరి 6వ తారీఖున బెంగుళూర్‌లో ఐపిఎల్‌ ఆటగాళ్ళ వేలం జరగనుంది. ఈ వేలంలో 714 మంది ఆటగాళ్ళు సిద్దంగా ఉన్నారు. అయినప్పటికీ ఇటీవల వివిధ ఫ్రాంచైజీలు విడుదల చేసిన 61 మంది ఆటగాళ్ళ పై మాత్రమే అందరి కళ్ళూ ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న 12 మంది ఆటగాళ్ళ కనీస ధరను 2 కోట్లు రూపాయలుగా ఐపీఎల్ యాజమాన్యం నిర్ణయించింది. గత సీజన్‌ లో యువరాజ్‌ సింగ్‌ కి అత్యధిక ధర పలికింది కానీ మైదానంలో ఘోరంగా విఫలం అవ్వడంతో జట్టుకు దూరమయ్యాడు. యూవీ ఈసారి 2 కోట్ల కనీసధర జాబితాలో చేరాడు. వేలంలో పెరిగే అవకాశం ఉన్నప్పటికీ యువరాజ్‌ కోసం ఎక్కువగా వెచ్చించరని భావిస్తున్నారు.

2 కోట్ల జాబితాలో యువరాజ్‌ సింగ్‌తో పాటుగా ఆశిష్‌ నెహ్రా, వాట్సన్‌, పీటర్సన్‌, ఇషాంత్‌, దినేష్‌ కార్తీక్‌, మిషెల్‌ మార్ష్‌, స్టువర్ట్ బిన్నీ, సంజు శామ్సన్‌, ధావల్‌ కులకర్ణి లు కూడా ఉన్నారు. 1.5 కోట్ల రూపాయల కనీసధర జాబితాలో జోస్ బట్లర్, డేల్‌ స్టెయిన్‌, మోహిత్‌ శర్మ ఉన్నారు. 1 కోటి రూపాయల కనీస ధర జాబితాలో ఇర్ఫాన్‌పఠాన్‌, టిమ్ సౌధీ ఉన్నారు. ఐపిఎల్‌ లో రాజ్‌కోట్‌, పూణే రెండు కొత్త జట్లు పోటీలో ఉండటం వల్ల వేలం చాలా ఆసక్తికరంగా సాగుతుందని క్రికెట్‌ వర్గాల వారు భావిస్తున్నారు.

English summary

IPL gave shock to Yuvaraj Singh. Last year season he got huge amount in auction. But 2016 season he got minimum price 2 crores. But he will not get huge price while considering to last season.