ఇరాక్‌కు ముందే తెలుసా

Iraq Knows About Attack On Paris

12:44 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Iraq Knows About Attack On Paris

పారిస్‌ మారణహోమం కోసం ముందుగానే ఇరాక్‌కు ఉప్పందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాక్‌కు చెందిన సీనియర్‌ రక్షణ వర్గ నిపుణులు పారిస్‌ మారణహోమానికి ఒకరోజు ముందుగానే ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు హెచ్చరించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. సిరియాలో అణిచివేతకు దిగుతున్న, సహకరిస్తున్న కూటమి దేశాలపై దాడులకు దిగాల్సిందిగా ఐఎస్‌ చీఫ్‌ అబు బకర్‌ భాగ్దాదీ వెలువరించిన ఆదేశాలు ఇరాక్‌ నిఘావర్గాలకు అందినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కానీ ఎక్కడ దాడి జరుగనుందో ఇరాక్‌ నిఘావర్గాలకు కూడా సరైన సమాచారం లేదట. ఇరాక్‌కు చెందిన విదేశాంగ మంత్రి ఈ విషయాన్ని ధృవికీరంచారు. తమకు ఒకరోజు ముందుగానే దాడులు జరగవచ్చనే వార్తలు వచ్చాయని కానీ ఎక్కడ జరుగుతుందో పక్కా సమాచారం లేదని పేర్కొన్నారు. ఈ దాడులకు సంబంధించి మొత్తం ప్రణాళిక కూడా సిరియాలోని రఖ్కా నుండే జరిగినట్లు తెలుస్తోంది. ప్రాన్స్‌లోని ఐఎస్‌కు చెందిన నిద్రాణదళాలు (స్లీపర్‌సెల్స్‌)ను ఈ దాడికి ప్రేరేపించినట్లు కూడా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మొత్తం 24 మంది ఉగ్రవాదులు ఈ దాడులలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

English summary

Iraq Knows About Attack On Paris