ఉగ్రవాదుల అడ్డుకట్టకు గ్రేట్ వాల్

Iraq To Build Big Wall To Stop Terrorists

11:20 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Iraq To Build Big Wall To Stop Terrorists

ఇరాక్‌. ఈ పేరు చెపితే నెత్తుటిఏరులు.. మారణహోమాలు గుర్తొస్తాయి. ఇరాక్ లో నిత్యం ఎక్కడో ఒక చోట దాడుల జరగం సర్వసాధారణం. ఇక రాజధాని బాగ్దాద్‌ నగరంలో అయితే ఉగ్రవాదుల దాడులకు అంతే లేదు. ఈ నేపథ్యంలోనే బాగ్దాద్ లోకి ఉగ్రవాదులు అడుగు పెట్టకుండా ఓ భారీ గోడ నిర్మించాలని ఇరాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ సైనికాధికారి అబ్దుల్‌ అమీర్‌ అల్‌ షమ్మరీ వెల్లడించారు. ఈ భారీ గోడ నిర్మాణంతో ఉగ్రవాదులను నగరంలోకి రాకుండా.. భారీ మందుపాతరలు తరలించకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. అమెరికా స్వాధీనం అనంతరం ఇరాక్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అయినా ఇరాక్‌లో జరుగుతున్న వర్గ పోరులో వేలాదిమంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. భారీగా ఆయుధాలు నింపిన ట్రక్కులను పేల్చివేయడం, ఆత్మాహుతి దళ సభ్యులు తమను తాము పేల్చుకోవడం... తదితర ఘటనలతో ఇరాక్‌ రోజూ రక్తమోడుతోంది. ప్రత్యేకించి రాజధానిలో ఎప్పుడు ఏ బాంబు పేలుతుందోనని ప్రజలు వణికిపోతున్నారు. 2007లోనూ అమెరికా దళాలు ఐదు కి.మీ. మేర గోడను నిర్మించి ఇరు వర్గాల మధ్య దాడులను కొంత నియంత్రించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తాజాగా బాగ్దాద్‌ చుట్టూ భారీ గోడను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

English summary

Iraq has begun building a wall and a trench around Baghdad in a bid to prevent militant attacks and reduce the large number of checkpoints inside the city.