ఇంటివాడుకానున్న ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan To Get Married Next Month

04:47 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Irfan Pathan To Get Married Next Month

భారత స్టార్ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, రోహిత్‌ శర్మల దారిలోనే మరో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరనున్నాడు. ఇటీవలే హర్భజన్, రోహిత్ ఓ ఇంటివారైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇర్ఫాన్‌ ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఇర్ఫాన్‌ తన వ్యక్తిగత విషయాల గురించి మీడియాతో ప్రస్తావించలేదు. అయితే ఈ మధ్య పెళ్లి గురించి వార్తలు వెలువడుతుండడంతో ఆఖరికి ఇర్ఫాన్‌ నోరు విప్పాడు. ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్న విషయం నిజమేనని మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపాడు. పెళ్లి వేడుకలు చాలా ఘనంగా జరుగనున్నాయని, వధువుతో పాటు ఇర్ఫాన్‌ చెల్లెలికి కూడా సూరత్‌ నుంచి ఆభరణాలు డిజైన్‌ చేయిస్తున్నట్లు ఇర్ఫాన్‌ సన్నిహితులు తెలిపారు.

English summary

Rohit Sharma,Harbajan Singh were married recently and now Baroda Pacer Cricketer Irfan Pathan to get married next month.Irfan Pathan was also confirm his marriage news