ఇర్ఫాన్ పఠాన్‌కు మరో చాన్స్: ధోని

Irfan pathan to select for T20 Matches

10:41 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Irfan pathan to select for T20 Matches

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో సత్తా చాటిన బరోడా పేసర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ మరోసారి టీమిండియా తలుపుతట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోని వెల్లడించాడు. శ్రీలంకతో ఈ నెల 9 నుంచి జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో ఆసియా, టీ20 వరల్డ్ కప్లో బరిలోకి దిగే జట్టు పై ఓ అవగాహన వస్తుందన్నాడు. మెగా టోర్నీలో పేసర్‌ ఆశిష్‌ నెహ్రాకు గాయం లేదా విశ్రాంతి అవసరమైనప్పుడు ప్రత్యామ్నాయంగా మరో ఎడమచేతి వాటం పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ను జట్టులో చేర్చుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పాడు. అలాగే స్పిన్నర్‌ రవీంద్ర జడేజాకి పవన్‌ నేగి, అశ్విన్‌కు హర్భజన్‌ సింగ్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకోగా.. అక్షర్‌ పటేల్‌ ఆశించిన మేర రాణించడం లేదన్నాడు. పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరాడని తెలిపాడు. ఇప్పటికే శ్రీలంకతో తలపడే తుది జట్టులో పఠాన్‌కు చోటు దక్కకపోయినా మెగా టోర్నీల్లో నేరుగా అవకాశమివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ధోనీ చెప్పాడు.ఇర్ఫాన్‌ 2012లో తన చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు.

English summary

India left arm bowler to selected for upcoming T20 series.He was to be selected for team India after couple of years.Recently in Irfan Pathan performed well in Syed Mustaq T20 series in India