ఈ హీరో విక్రమ్ అంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే(వీడియో)

Iru Mugan official trailer

04:41 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

Iru Mugan official trailer

విక్రమ్ ఎంత అద్భుతమైన నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విక్రమ్ ని కమల్ హాసన్, అమీర్ ఖాన్ లతో పోలుస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు విక్రమ్ కూడా చేసాడు.. చేస్తున్నాడు కాబట్టి. విక్రమ్ నటించిన సినిమా హిట్ ఆ.. ప్లాప్ ఆ అన్న విషయం పక్కన పెడితే.. అందులో విక్రమ్ కనబర్చిన వైవిధ్యం, నటన, శ్రమ అన్నీ కనిపిస్తాయి. అందుకే సినిమా ప్లాప్ అయినా విక్రమ్ మాత్రం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాడు. ఇప్పుడు ఈ అద్భుత నటుడు తాజాగా 'ఇరుమగన్'(తెలుగులో ఇంకొక్కడు) అనే చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. విక్రమ్ టాలెంట్ ఏంటో ఇట్టే అర్ధమైపోతుంది.

ఒక ప్రక్కన బారీతీయ ఇంటెలిజెన్స్(రా) ఆఫీసర్ గా.. మరో ప్రక్కన ఒక హిజ్రా విలన్ గా.. పిచ్చెక్కించాడంతే. మలేషియాలో కెమికల్ సైంటిస్ట్ అయిన ఒక హిజ్రా డ్రగ్స్ సప్లయ్ చేస్తుంటాడు. అతగాడిని పట్టుకోవడానికి ఇండియా నుండి ఇద్దరు ఆఫీసర్లు వస్తారు.. ఒకరు విక్రమ్ మరొకరు నిత్యా మీనన్. అదే కథ. ఈ మధ్యలో నయనతార విక్రమ్ గాళ్ ఫ్రెండ్ గా కనిపిస్తుంది. ఆమె కూడా ఒక సీక్రెట్ ఏజెంటే. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో రూపొందిన ఈ సినిమా విజువల్స్ అండ్ మ్యూజిక్ క్వాలిటీ హాలీవుడ్ రేంజులో ఉంది. హారీస్ జయరాజ్ మరోసారి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఇకపోతే నిత్యా మీనన్ పాత్ర చిన్నదే అనుకుంట కానీ.. నయనతార మాత్రం అందాలతో ఊరిస్తోంది. మరి డబుల్ యాక్షన్లో విక్రమ్ ఈసారి ఏ మ్యాజిక్ చేస్తాడో చూడాల్సిందే. ఒకసారి ఈ ట్రైలర్ పై మీరు ఒక లుక్ వెయ్యండి.

English summary

Iru Mugan official trailer