విక్రమ్ 'ఇరు ముగన్' టీజర్ అదిరిపోయిందిగా

Iru Mugan tamil teaser

02:48 PM ON 19th April, 2016 By Mirchi Vilas

Iru Mugan tamil teaser

విలక్షణ నటుడు విక్రమ్ 'ఐ' చిత్రం తరువాత నటిస్తున్న తాజా చిత్రం 'ఇరుముగన్'. ఐ చిత్రంలో విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కధాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శిబు తామీన్స్ నిర్మిస్తున్నాడు. తమిళంలో ‘ఇరుముగన్’ పేరుతో రానుండగా, తెలుగులో టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే దీనికి సంబంధించిన టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. నిమిషం నిడివిగల ఈ టీజర్‌లో ఎక్కువభాగం మలేషియాలో షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలు అడిరిపోయాయనే చెప్పాలి.

ఇక నిత్యామీనన్ మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. విక్రమ్ ట్రాన్స్‌జెండర్ రోల్ కోసం హార్డ్‌గా కష్టపడినట్టు సమాచారం. ఇప్పటి వరకు 60 శాతం షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌ కోసం లడఖ్, బ్యాంకాక్ వంటి ప్రాంతాలకు చిత్ర యూనిట్ వెళ్లనుంది. ఐ చిత్రాన్ని జూలై ఎండింగ్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ సన్నాహాలు చేస్తున్నారు.

English summary

Iru Mugan tamil teaser. Tamil actor Vikram latest movie Iru Mugan. This is the Science fiction movie. This movie is directing by Anand Shankar. Nayanthara and Nithya Menon was romacing with Vikram in this movie. Vikram is doing dual role in this movie.