గల్ఫ్ లో ఉన్న 1400 కోట్లు ఎందుకూ పనికిరానట్టేనా?!

Is 1400 crores in Gulf was not usable

11:10 AM ON 18th November, 2016 By Mirchi Vilas

Is 1400 crores in Gulf was not usable

పెద్ద నోట్ల రద్దు యవ్వారం గల్ఫ్ లో భారతీయులపై పెను ప్రమాదం చూపిస్తోందట. ఇంతకీ ఏమైందంటే, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పీతాని రాధికాదేవి సౌదీ అరేబియాలో ఉంటున్నారు. గతంలో ఇండియా నుంచి గల్ఫ్ వెళ్ళేటప్పుడు అత్యవసర ఖర్చుల కోసం ఆమె తన వెంట రూ.8వేలను తీసుకెళ్ళారు. అదేవిధంగా హైదరాబాద్ టోలీచౌకీ చెందిన సయ్యద్ హమీద్ రూ.7వేలు పట్టుకెళ్లారు. అయితే గల్ఫ్ లో ఇప్పుడు ఆ నోట్లను మార్చుకునే అవకాశం లేదు. ఇదేమంత పెద్ద మొత్తం కూడా కాకపోవడంతో ఈ కరెన్సీని మార్చుకునేందుకు వారు భారత్ కు వెళ్లాలనీ అనుకోవడం లేదు. అయితే ఇక్కడే అసలు చిక్కుంది.

1/4 Pages

రాధికాదేవి, హమీద్ ల మాదిరిగానే గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న 70 లక్షల మంది భారతీయుల వద్ద రద్దయిన పెద్దనోట్లు మూలుగుతున్నాయి. వీరి వద్ద తలా రూ.2వేలు ఉన్నాయని అనుకున్నా.. రద్దయిన పెద్దనోట్ల విలువ రూ.1400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో ఈ సొమ్ము అంతా ఎందుకూ పనికి రాకుండా పోతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

English summary

Is 1400 crores in Gulf was not usable