రాజమౌళి ట్విస్ట్: బాహుబలి బ్రతికే ఉంటాడా?

Is Baahubali is not killed by Kattappa?

02:44 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Is Baahubali is not killed by Kattappa?

జక్కన్న రూపొందించిన 'బాహుబలి' అనూహ్యంగా విజయం సాధించి, వసూళ్ళ మోత మోగించి, ఇక తెలుగు ఇండస్ట్రీకి ఇంత వరకూ దక్కని అరుదైన గౌరవం కూడా వచ్చేసింది. అదేనండీ, జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన తొలి తెలుగు చిత్రంగా రికార్డుకెక్కింది. 'బాహుబలి -2' మీద ఇంకా పెద్ద కసరత్తు చేయాల్సిన పరిస్తితి ఏర్పడింది. కాగా 'బాహుబలి' సినిమాలో కట్టప్ప చేతిలో బాహుబలి చనిపోయినట్టు ట్విస్ట్ ఇచ్చి మరీ 'బాహుబలి -2' కోసం ప్రేక్షకులు ఎదురు చూసే విధంగా జక్కన్న మంత్రజాలం పని చేసింది. అయితే బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న అందరి మదిలో ఉంది. ఇదే ప్రశ్న కట్టప్ప పాత్ర వేసిన సత్యరాజ్ నుంచి రాజమౌళి వరకూ అందరినీ కదిపినా క్లారిటీ రాలేదు.

ఇది కూడా చదవండి: విశాల్ ను పెళ్లి చేసుకున్న అంకిత

దీంతో స్పూఫ్ లు సిద్ధమవ్వడంతో నేరుగా రాజమౌళి స్పందించాడు. మొన్ననే 63వ జాతీయ స్థాయి చలన చిత్ర అవార్డుల ప్రకటన నేపధ్యంలో బాహుబలికి అరుదైన గౌరవం లభించడంతో చిత్ర బృందానికి రాజమౌళి అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్న రావడంతో జక్కన్న స్పందిస్తూ, అసలు బాహుబలి ఎందుకు చనిపోతాడు? అని ఎదురు ప్రశ్నించడంతో, అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారట. షాక్ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టిందట. దీంతో ఇప్పటివరకు కట్టప్ప చేతిలో బాహుబలి చనిపోయినట్టు అనే ప్రశ్న ఉదయించగా, జక్కన్న వ్యాఖ్యతో బాహుబలి చనిపోలేదా అనే కొత్త ప్రశ్న తలెత్తింది. ఇంతకీ రాజమౌళి సరదాగా అన్నాడా, నిజంగా ట్విస్ట్ ఉందా అనేది తేలాలి.

ఇది కూడా చదవండి: కుక్కని రేప్ చేసి ఆ పై...

English summary

Is Baahubali is not killed by Kattappa? At media conference S.S. Rajamouli said that who told that Baahubali was died.