పక్షులు అదృష్టమా.. దురదృష్టమా.. మీరే తేల్చండి

Is birds good or bad

12:08 PM ON 30th July, 2016 By Mirchi Vilas

Is birds good or bad

స్వేచ్ఛకు చిహ్నంగా పక్షిని చెబుతారు. స్వేచ్ఛా విహంగానికి ప్రతీక. ఉదయాన్నే లేచి ఆహారం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించే వాటిని క్రమశిక్షణకు మారుపేరుగా కూడా చెబుతారు. అయితే పక్షి అదృష్టానికి సంకేతం, దురదృష్టానికి ప్రతీక అని ఎవరైనా అంటారా? అనేవాళ్లు ఉన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పక్షుల విషయంలో కొన్ని విశ్వాసాలున్నాయి. అవి నిజామా కాదా అంటే కాదనీ, అవుననీ చెప్పలేం. ఎవరి నమ్మకాలు వారివి కదా! జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవన్నీ ఆయా పక్షులకున్న ప్రత్యేక లక్షణాలను బట్టి ఏర్పడిన నమ్మకాలని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

అయితే, వాటిలో ఏవో కొన్ని బలహీనతలు ఉన్నాయని, వాటిని మనకు అన్వయించుకుని చెడు జరుగుతుందని, దురదృష్టం చుట్టుకుంటుందని భయపడటమే మంచిది కాదు. కానీ ఒక్కసారి నమ్మకం ఏర్పడితే దాన్ని మనసులోంచి తీయడం చాలా కష్టం. కాకపోతే ఆ నమ్మకం భయాన్ని సృష్టించేది అయితే, దాన్ని ఎలాగైనా వదులుకోవడమే మంచిదని పెద్దలు అంటారు. అయితే కొన్ని దేశాల్లో పక్షుల విషయంలో కొన్ని కొన్ని విశ్వాసాలు ఉంటాయి. వాటిని పరిశీలిస్తే, ఏంటో చూద్దాం..

1/8 Pages

1. కొంగ:


ఇది స్వచ్ఛతకు, ప్రశాంతతకు చిహ్నమట. అందుకే ఉదయం లేచిన తరువాత కొంగను చూస్తే, ఆ రోజంతా ప్రశాంతంగా గడుస్తుందని, అదే సంవత్సరం తొలి రోజున చూస్తే మరుసటి యేడు వచ్చేవరకూ అంతా సంతోషంగా గడిచిపోతుందని పలు దేశాల్లో నమ్ముతారు. అంతేకాదు, ఆరోగ్యం కూడా బాగుంటుందని అంటారు.

English summary

Is birds good or bad