దాసరి పై కక్ష  ఎవరికీ ...

Is BJP Targets Dasari Narayana Rao On Coal Scam

12:54 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

Is BJP Targets Dasari Narayana Rao On Coal Scam

కధ ముగిసిపోయిందనుకున్న సమయంలో మళ్ళీ మొదటికి వస్తే ఎలా వుంటుందో ఇప్పుడు కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు పరిస్థితి అలా వుందట. ఇంతకీ విషయం ఏమంటే, దర్శకరత్న.. దాసరి నారాయణరావు చుట్టూ కోల్ గేట్ ఉచ్చు బిగుస్తుండటం కేంద్రంలోని బిజెపి చలవేనా? ఏమో మరి ప్రస్తుతం హస్తిన టాక్ ఇదేనట. ఎందుకంటే చాలా కాలంగా రాజకీయాల్లో ఉండటం. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం..ప్రస్తుత ఎపి రాజకీయ పరిస్థితుల నేపథ్యంతో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో చక్రం తిప్పాలన్నది దాసరి ఆలోచనగా కనిపిస్తోంది.దీంతో దాసరికి ఇబ్బందులు కల్పించి రాజకీయంగా ఫుల్ స్టాప్ పెట్టాలన్నది బిజెపి వ్యూహంగా వుందట.

ఇవి కూడా చదవండి:కిడ్నాప్‌ అయిన బాలుడు దారుణ హత్య

డాక్టర్ దాసరి గత కొంతకాలంగా తన ఇమేజ్‌ని బిల్డ్ చేసుకునే పనిలోపడ్డారు. కాపు గర్జన సమయంలో దాసరి హంగామా కనిపించింది. అదే ఊపును కంటిన్యూ చేస్తూ ప్రత్యేక పార్టీ దిశగానూ దాసరి అడుగులు వేస్తున్నారు. వీటికి చెక్ చెప్పేందుకే ముగింపు దశకు వస్తున్న కోల్ స్కాం వ్యవహారం తిరగతోడుతున్నారని గుసగుసలు. అయితే, ఇది కేంద్రంలోని బిజెపికి స్వయంగా చేస్తోందికాదని, మరెవరో దీనివెనుక కథ నడిపిస్తున్నారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే,అసలు దాసరిని టచ్ చేయాల్సిన అవసరం బిజెపికి గానీ,మరోపార్టికి గానీ ఏముందనేది అర్ధం కాని ప్రశ్న. ఇప్పటికే వయసు మీదపడుతున్న దాసరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని కమల దళం నుంచి స్పష్టంగా వినిపిస్తోంది.ఇక కోల్ గేట్ స్కామ్ లో ఛార్జిషీట్లు, కోర్టు ఉత్తర్వులు అన్నీ సాంకేతిక అంశాలని వీటికి రాజకీయాలు ముడిపెట్టడం సరికాదన్నది న్యాయనిఫుణుల చెప్పే మాట.మరి దాసరి స్పందన ఎలా వుండబోతున్నది కొంతకాలం వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:చిన్నప్పుడు తీసుకున్న పుస్తకాన్ని అమ్మమ్మయ్యాక ఇచ్చింది

ఇవి కూడా చదవండి:పవన్ ని చీల్చి చెండాడేసిన వర్మ

English summary

Ex-Central Minister Dasari Narayana Rao was in the case of Coal Scam. Now according to a news that BJP was planning to keep check to Dasari Narayana Rao.