టీపై పేరుకున్న మీగడను తీయకుండానే తాగితే ఏమౌతుందో తెలుసా?

Is cream on tea is good for health

12:18 PM ON 24th November, 2016 By Mirchi Vilas

Is cream on tea is good for health

ఈ యాంత్రిక యుగంలో అన్నిపనులు వేగంగానే ఉంటున్నాయి. కనీసం ఓ పది నిమిషాలు టీ తాగడానికి కూడా సరైన దృష్టి పెట్టలేని పరిస్థితి కొందరిని చూస్తే తెలుస్తుంది. నిజానికి టీ అంటే ఇష్టం ఉండనిది ఎవరికి ఉండదు. ఏ కాలంలోనైనా వేడి వేడిగా ఉండే టీ అలా నెమ్మదిగా గొంతులోకి దిగుతుంటే వచ్చే మజా గురించి చెప్పేది కాదు. ముఖ్యంగా చలికాలంలోనైతే టీ ఇచ్చే ఉత్తేజమే వేరు. నీరసంగా, మబ్బుగా ఉన్నవారు కూడా టీ తాగితే ఉత్తేజం పొందుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. అది సరే, ఇంతకీ టీ తాగేటప్పుడు చాయ్ మీద మీగడ తెట్టులా పేరుకుపోతుంది చూశారా..? అలా మీగడ పేరుకుపోయిన టీని తాగితే మంచిదా..? లేదంటే ఆ మీగడ తీసేసి చాయ్ తాగాలా అనే విషయం గురించి తెలుసుకుందాం...

1/6 Pages

సాధారణంగా అలా చాయ్ మీద మీగడ పేరుకుపోవడమనేది అందులో కలిపే పాల వల్ల వస్తుంది. పాలను కొద్దిగా వేడి చేసినప్పుడు అందులో ఉండే తేలికపాటి కొవ్వులు దాని మీద పొరలా వచ్చి మీగడలా పేరుకుంటాయి. ఆ క్రమంలో ఆ పాలతో చాయ్ పెడితే ఆ చాయ్ పై కూడ మీగడ పొరలా వస్తుంది. దీర్ఘ కాలికంగా అలా తాగితే మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయట. అవేమిటంటే..

English summary

Is cream on tea is good for health