దీపావళి అంటే ఐశ్వర్యానికి సంకేతమా?

Is Deepawali is symbol of assets

05:17 PM ON 26th October, 2016 By Mirchi Vilas

Is Deepawali is symbol of assets

హిందువులు జరుపుకునే పండుగలన్నింటిలో దీపావళికి ఓ ప్రత్యేకత ఉంది. కొత్త బట్టలు, పిండి వంటలతో పాటు... సాయంత్రం వేళ అందమైన దీపాలు వెలుగుతో ప్రతి ఇల్లు కళకళలాడుతుంది. దీపావళి పండుగ అంటే చాలు గుర్తుకు వచ్చేది టపాకాయలు. చిన్న, పెద్ద, ధనిక, పేద, కులం, మతం అనే బేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరు అత్యంత ఉత్సాహంగా జరుపుకొనే ప్రత్యేకమైన పండుగ ఒక్క దీపావళి.

1/5 Pages

ఇది మన తెలుగు వారికి, తక్కిన దక్షిణ భారతీయులకు మూడు రోజుల పండుగ ఆస్వయుజ మాసంలో వచ్చే దీపావళి పండుగలో మెదటి రోజు నరక చతుర్ధశి, రెండవది దీపావళి అమావాస్య, మూడవది బలి పాడ్యమి. జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

English summary

Is Deepawali is symbol of assets