సంపూర్ణ మద్య నిషేధం సాధ్యమేనా ?

Is it possible to ban liquor.?

03:29 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Is it possible to ban liquor.?

విజయవాడ కృష్ణ లంక స్వర్ణ బార్ లో కల్తీ మద్యం ఘటనతో మద్య నిషేధం అంశం మళ్ళీ తెరమీదికి వచ్చింది.ఎందుకంటే తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం విదిస్తానని వైస్సార్ సిపి నేత జగన్ ప్రకటించారు. ఇక కామ్రేడ్లు కూడా సంపూర్ణ మద్య నిషేధం కోసం ఉద్యమం రూపొందించాలని భావిస్తున్నారు. ఇందుకు కృష్ణ లంక ఘటనే నాంది కావాలని సిపిఎమ్ నేత పి మధు అంటున్నారు. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక వేరే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. టిడిపి మేనిఫెస్టో మేరకు దలవారీగా మద్య నిషేధం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేసారు. భావ సారూప్యత గల పార్టీలతో కల్సి సంపూర్ణ మద్య నిషేధ ఉద్యమం ప్రారంభించడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.

మరో పక్క సిపిఐనేత కె రామకృష్ణ కృష్ణ లంక ఘటనపై సీరియస్ గా స్పందిస్తూ , చంద్రబాబు ఎన్నికల ప్రణాళికకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్సించారు. దశలవారీ సంపూర్ణ మద్య నిషేధం అంటూ మరోపక్క మద్యం మాఫీయాను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో మద్యంపై వచ్చిన ఆదాయాన్ని ఎపిలోని 13 జిల్లాల్లో సంపాదించారని ఆయన ద్వజమెత్తారు.

ఒకసారి గతంలో జరిగిన పరినామాలలోకి వెళితే , 1994 కి ముందు రాష్ట్రంలో ఉవ్వెత్తున మద్య నిషేధ ఉద్యమం సాగింది. కాంగ్రెస్ అధికారంలో వుండగా , అప్పట్లో దూబగుంట లో మద్య పాన నిషేధ ఉద్యమం మొదలై , రాష్ట్రమంతా పాకడంతో, పలువురు ఉద్యమంలో పాల్గొన్నారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా ఉద్యమ బాట పట్టారు. షాపుల ద్వసం , కేసులు షరా మామూలే. దీంతో సంపూర్ణ మద్య నిషేధం ఎన్నికల నినాద మైంది. అంతేకాదు మద్యం దుకాణాలు వున్నవాళ్ళకు టికెట్స్ ఇవ్వబోమని కూడా అప్పట్లో ఎన్ టి ఆర్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు , 1995లొ ఎన్ టి ఆర్ సంపూర్ణ మద్య పాన నిషేధం విధించారు. అప్పుడే ఎక్సైజ్ శాఖ బదులు ప్రొహిబిషన్ శాఖ పుట్టింది. అయితే , ఆ తర్వాత సిఎమ్ గా చంద్రబాబు అధికారం చేపట్టడంతో మద్య నిషేధం గాల్లో కలసిపోయింది. దీనికి తోడు క్రమేపి బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి. ఆతర్వాత సిఎమ్ గా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినా మద్య నిషేధం అమలు కాలేదు. బెల్ట్ షాపులూ హెచ్చాయి. దశలవారీగా మద్య నిషేధం ఒట్టిమాట అయింది. దాంతో బస్సు యాత్ర సందర్భంగా చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తేస్తామని , దశలవారీగా మధ్య నిషేధం విధించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే బెల్ట్ షాపులను తొలగిస్తున్నట్టు . ప్రకటించినా, వేరేరకంగా షాపుల సంఖ్యా పెరిగింది . రైతుల రుణమాఫీ, సంక్షేమ పధకాల అమలుకు మద్యం పాలసీయే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇప్పుడు కృష్ణ లంక ఘటనతో మద్య నిషేధం డిమాండ్ తెరమీదికి వచ్చింది.

అయితే రాష్ట్ర ఖజానాకు కీలకంగా మారిన మద్యాన్ని నిషేధించే విషయంలో ప్రభుత్వం ముందుకొస్తుందా? అసలు ఇది సాధ్యమేనా ? ప్రధాన ఆదాయ వనరుని ప్రభుత్వం వదులు కుంటుందా ? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలు

English summary

Few days back some people were died in vijayawada by drinking alchohol . Chief minister of andhra pradesh Chandrababu naidu says that they will ban adulterated liquor in Andhrapradesh