సొంతపార్టీకి మోడీ లీక్ చేశారా? అధి నల్లడబ్బా?

Is Narendra Modi leaked to his party about 500 and 1000 notes banning

01:42 PM ON 14th November, 2016 By Mirchi Vilas

Is Narendra Modi leaked to his party about 500 and 1000 notes banning

కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం బిజెపి వాళ్లకు ముందే తెలుసా? తెలిసే చేసారా? ఇదంతా ఎందుకంటే, ఈ యవ్వారంపై ప్రతిపక్షనేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అందుకే పెద్ద నోట్ల రద్దు వ్యవహారానికి రాజకీయ రంగు పులుకుంటోంది. రకరకాల విమర్శలు పెల్లుబికుతున్నాయి. వాటి వివరాల్లోకి వెళ్తే... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దుకు ముందే బెంగాల్ కు చెందిన ఓ బీజేపీ నేత తన అకౌంట్లోకి కోటి రూపాయలు డిపాజిట్ చేసినట్లు గల ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. తద్వారా నోట్ల రద్దు వల్ల బీజేపీ నేతలు లాభపడ్డారంటూ కాంగ్రెస్, ఆప్, ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు తీవ్ర ఆరోపణల్లో నిజమున్నట్లు తెలుస్తోంది.

1/5 Pages

ఈ నెల 8న బీజేపీ నేత చేసిన ముందస్తు డిపాజిట్ వివరాలు ప్రస్తుతం బయటపడ్డాయి. సొంత పార్టీకి లీకులిచ్చిన తర్వాతే మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ప్రకటన చేశారని విమర్శిస్తున్నారు. అయితే ఈ వార్తలను బెంగాల్ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ఖండించారు. ఇదేమీ బ్లాక్ మనీ కాదని, పార్టీకి వచ్చిన ఫండ్ అని, దీనిపై విచారణ జరిపిస్తే అధికారులకు లావాదేవీల డీటేల్స్ ఇస్తామని దిలీప్ ఘోష్ సవాల్ విసిరారు.

English summary

Is Narendra Modi leaked to his party about 500 and 1000 notes banning