ఈసారి మా టార్గెట్ బ్రిటన్‌: ఐఎస్

IS Next Target was Britain

04:08 PM ON 4th January, 2016 By Mirchi Vilas

IS Next Target was Britain

ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తమ టార్గెట్ లను రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈసారి తాము బ్రిటన్ మీద దాడి చేస్తామని ఐఎస్ ఉగ్రవాద సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని సిరియా మానవహక్కుల సంస్థ తెలిపింది. బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను ఐఎస్ ఉగ్రవాది ఒకరు ఫూల్ అని తిట్టారు. ఆ తర్వాత ఐదుగురి తలలు నరికేశాడు. ఈ ఐదుగురూ బ్రిటన్ తరఫున పనిచేస్తూ ఐఎస్ మీద గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపించాడు. ఉత్తర సిరియాలో ఉగ్రవాద రాజధానిగా ఉన్న రక్కా ప్రాంతంలో ఈ వీడియోను తీసినట్లు తెలుస్తోంది. సిరియాలో ఐఎస్ మీద దాడి చేయాల్సిన నైతిక, సైనిక బాధ్యత బ్రిటన్ మీద ఉందని ప్రధాని కామెరాన్ గత నెలలో అన్నారు. ఇప్పటికే ఇరాక్‌లో వైమానిక మార్గంలో ఐఎస్ మీద దాడులు చేస్తున్న బ్రిటన్.. ఇటీవలే సిరియాకు కూడా ఆ దాడులను విస్తరించింది.

English summary

Islamic State terrorits released a video recently. In that video a unknown person talks and says that their next target was Britain