సెంటిమెంట్ కోసం ఎన్టీఆర్ సమంత కాళ్ళు పట్టుకుంటాడా?

Is Ntr will follow Koratala sentiment

05:35 PM ON 5th July, 2016 By Mirchi Vilas

Is Ntr will follow Koratala sentiment

కధా రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ ఇప్పటి వరకు రెండు చిత్రాలను తెరకెక్కించాడు. కొరటాల తీసిన రెండు చిత్రాలు సూపర్ హిట్టే. ఆ రెండు సినిమాల్లో తనదైన సెంటిమెంట్ ని ఫాలో అవుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించింది రెండే సినిమాలు అయినా.. ఆ రెండింటిలోనూ అతని ఫాలో అయే సెంటిమెంట్ ని చాలా హైలైట్ చేసి చూపించాడు. ఇప్పుడు దాని గురించి ఇండస్ట్రీలో అందరూ చర్చించుకుంటున్నారు. అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. మొదట 'మిర్చి' సినిమా తీసుకుందాం.. ఈ చిత్రంలోని 'ఇదేదో బాగుందే చెలి' అనే పాటలో అనుష్క పాదాలను తడుముతూ ప్రభాస్ నెయిల్ పాలిష్ వేస్తాడు.

ఇక రెండో చిత్రం 'శ్రీమంతుడు'లోనూ 'జత కలిసే' పాటలో శృతి కాళ్ళను మహేష్ పట్టుకుంటాడు. అంటే.. హీరోయిన్ల పాదాలను హీరో పట్టుకోవడమనే సెంటిమెంట్ ని కొరటాల ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సెంటిమెంట్ ని జనతా గ్యారేజ్ మూవీలోనూ అతడు ఫాలో అవుతాడా? అనే విషయంపై ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలిచింది. అంటే.. ఆ ఇద్దరి హీరోల్లాగే గ్యారేజ్ మూవీలో సమంత కాళ్ళను ఎన్టీఆర్ పట్టుకుంటాడా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. దీనిపై క్లారిటీ రావాలంటే.. సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే..

English summary

Is Ntr will follow Koratala sentiment