ప్రత్యూష గర్భవతా!?

Is Pratyusha Banerjee is pregnant?

10:54 AM ON 4th April, 2016 By Mirchi Vilas

Is Pratyusha Banerjee is pregnant?

మొన్న టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఆత్మహత్య వెనుకున్న అసలు విషయాలు ఒక్కొక్కటి గా బయటకు వస్తున్నాయి. తాజాగా ప్రత్యూష రెండు నెలల గర్భవతి అని అనుమానిస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు. అయితే ఆమె ప్రెగ్నెన్సీ తొలి దశలో ఉందని భావిస్తున్న వైద్యులు ఆమె యూటిరస్ శాంపిల్స్‌ను జేజే ఆసుపత్రికి పంపినట్టు మిడ్ డే  అనే ఓ పత్రిక తెలియజేసింది. యూటిరస్‌లోని ఫ్లూయిడ్‌ను అక్కడికి పంపారని, పరీక్షల్లో ఇది బహుశా గర్భం ఏర్పడే తొలి దశ అని నిర్ధారించవచ్చునని అంటున్నారు. అయితే ఇది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని కూడా వైద్యులు తెలియజేశారు. 

ఇదిలా ఉంటే చిన్నారి పెళ్లికూతురు ‘ఆనంది’ ప్రత్యూష బెనర్జీ అంత్యక్రియులు కన్నీటి వీడ్కోలు నడుమ పూర్తయ్యాయి. ముంబయిలోని తన ఫ్లాట్ లో ఫ్యాన్ కు ఉరేసుకున్న ఆమె వీడ్కోలు యాత్ర ఆదివారం నిర్వహించారు కుటుంబ సభ్యులు.. బంధుమిత్రులు.. అభిమానుల వెంట రాగా.. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను ఖననం చేశారు. మధ్య ముంబయిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియల్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె భౌతిక  కాయాన్ని పెళ్లికూతురుగా ముస్తాబు చేయడం చర్చకు దారి తీసింది. త్వరలో తన పెళ్లి వస్త్రాల్ని డిజైన్ చేయాల్సి ఉంటుందని డిజైనర్ రోహిత్ వర్మను ప్రత్యూష కోరటం.. అంతలోనే ఆమె ఆత్మహత్య చేసుకోవటం పై ఆమె స్నేహితులు షాకయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె భౌతిక కాయాన్ని పెళ్లికూతురుగా అలంకరించారట. 

1/3 Pages

మృతి పై అనుమానాలున్నాయన్న తల్లి:


కాగా ప్రత్యూష ఆత్మహత్యకు సంబంధించి తమకు చాలానే సందేహాలు ఉన్నట్లు ఆమె తల్లి డాలీ చెబుతున్నారు. ప్రత్యూష కళ్లు ప్రశాంతంగా ఉండటం.. నుదిటి మీద తాజా సింధూరం కనిపించటం లాంటివి చూస్తే ఆమెది ఆత్మహత్యగా కనిపించటం లేదని ఆమె అంటున్నారు. ఆమె మృతదేహాన్ని చూసినప్పుడు చాలా సందేహాలు కలిగేలా ఉన్నాయన్నారు..

English summary

Is Pratyusha Banerjee is pregnant? Their is another suspense for Pratyusha Banerjee suicide case. Doctors said that Pratyusha Banerjee is preganant.