రాజమౌళి 'గరుడ' మంచు విష్ణుతోనా ?

Is Rajamouli's Garuda Movie With Manchu Vishnu?

05:07 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Is Rajamouli's Garuda Movie With Manchu Vishnu?

టాలీవుడ్‌ టాప్‌ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన 'బాహుబలి' చిత్రంతో యావత్తు ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. బాహుబలి-2 తర్వాత రాజమౌళి తరువాత సినిమాగా 'గరుడ' అనే సినిమాను చిత్రీకరిస్తాడని అంతా అనుకుంటున్నారు. ఈ గరుడ సినిమాను ఏకంగా 1000 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. రాజమౌళి కూడా ఈ విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా రెండు మూడు సార్లు పస్తావించాడు కూడా . దీంతో రాజమౌళి బాహుబలి -2 తరువాత 'గరుడ' సినిమాను మొదలు పెడతానని అందరూ అనుకుంటున్న సమయంలో 'గరుడ' అనే టైటిల్‌ ను హీరో మంచు విష్ణు రిజిష్టర్‌ చెయ్యడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇలా మంచు విష్ణు హీరోగా , రాజమౌళి 'గరుడ' సినిమా తీస్తాడని అని అందరూ భావిస్తున్న సమయంలో ఒక ఫంక్షన్‌ లో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ తాను భారీ బడ్జెట్‌తో 'గరుడ' సినిమాను చిత్రీకరిస్తానని , అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయం పై మాత్రం ఇంకా స్పష్టత లేదని అన్నాడు.

ఇప్పుడప్పుడే 'గరుడ' చిత్రం గురించి ఏ విషయం చెప్పలేనని రాజమౌళి అన్నాడు. రాజమౌళి ఇలా స్పందించడంతో మంచు విష్ణు రిజిస్టర్‌ చేయించుకున్న గరుడ టైటిల్‌ విష్ణు క్లారిటీ ఇస్తే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు.

English summary

Hero Manchu Vishnu Registered Garuda Title In Film Chamber. Previously Director S.S.Rajamouli said in few occasions that he is going to Make A huge budget film "Garuda".Due to taht all were in confusion that Rajamouli's Garuda Movie With Manchu Vishnu?