'సర్దార్' లో షకలక శంకర్ ని తీసేసారా?

Is Shakalaka Shankar is out from Sardar Gabbar Singh movie

10:32 AM ON 28th March, 2016 By Mirchi Vilas

Is Shakalaka Shankar is out from Sardar Gabbar Singh movie

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. 'పవర్' ఫేమ్ బాబీ తెరకెక్కించిన ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఇందులో పవన్ సరసన కాజల్ అగర్వాల్, సంజన, రాయ్ లక్ష్మీ హీరోయిన్లుగా నటించారు. పవన్ స్నేహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రంలో కామెడీ బాగా రావడం కోసం 'జబర్ధస్త్' లో నటించే వాళ్ళందరినీ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుంచి షకలక శంకర్‌ను తీసేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ చిత్రం టీమ్ శనివారం రిలీజ్ చేసిన ప్రమోషనల్ బులెటిన్ పోస్టర్ లో ఈ చిత్రంలో నటించిన కమీడియన్ లు అందరూ ఉన్నారు కానీ షకలక మాత్రం లేడు.

ఇది కూడా చదవండి: మోడలింగ్ ఫొటోలతో 'వ్యభిచారి' గా బుక్కయిన టీచర్

పోస్టర్ లో కనిపించకపోయినా సినిమా లో కనిపిస్తాడు అని అనుకుందాం అన్నా... ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పవన్ కళ్యాణ్ ఇటీవలే షకలక శంకర్ ఓవర్ యాక్షన్ చెయ్యడంతో సెట్స్ లోనే పవన్ షకలక శంకర్‌ను చెంపదెబ్బ కొట్టినట్టు వార్తలు వచ్చినట్లు తెలిసిన విషయమే. అయితే దానికి షకలక శంకర్ స్పందిస్తూ పవన్ తనని కొట్టలేదని, కేవలం వార్నింగ్ మాత్రమే ఇచ్చారని, తమ ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉందని చెప్పి షకలక శంకర్ తన పరువు పోకుండా ఉండేదుకు ప్రయత్నించాడు. కానీ ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

ఇది కూడా చదవండి: పాపం.. 19 నెలల కూతురినే పెళ్ళాడిన తండ్రి ...

అంతే కాకుండా ‘సర్దార్’ ఆడియో లాంచ్ లో కామెడీ టీమ్ మొత్తం దర్శనం ఇచ్చింది కానీ షకలక శంకర్ మాత్రం రాలేదు. దీనిని బట్టి చూస్తే ఈ సినిమా నుండి షకలక శంకర్ ని తీసేశారని అనడానికి ఇంతకన్నా రుజువు ఏం కావాలి. మళ్లీ శంకర్ దీని పై క్లారిటీ ఇస్తే తప్ప ఏం జరిగిందో తెలీదు.

ఇది కూడా చదవండి: మిస్ ఇండియా కాంపిటేషన్ లో చిత్తూరు నెరజాణ ...

English summary

Is Shakalaka Shankar is out from Sardar Gabbar Singh movie? Sardar team has been released a new poster, In that Shakalaka Shankar is not appeared.