చిరంజీవి వల్లే కాలేదు, ఇతని వల్ల అవుతుందా?

Is Sudheer Babu will success in Bollywood

01:18 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Is Sudheer Babu will success in Bollywood

ఏమో ఏ పుట్టలో ఏ పాముందో అంటారు కదా, మహామహుల వలన కాలేనిది ఒక్కోసారి చాలా చిన్న వాళ్ళ వలన అయిపోతుంది. ఇది కూడా ఆలాంటిదే. బాలీవుడ్ స్టార్ ఈ ట్యాగ్ కోసం చాలా మంది తెలుగు హీరోలు తపన పడ్డారు. కానీ ఇప్పటి వరకూ ఏ ఒక్క హీరో ఆ టార్గెట్ ని అందుకోలేక పోయారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి సక్సెస్ కొట్టిన వాళ్లంతా శ్రీదేవీ, జయప్రద ఇలా హీరోయిన్లు మాత్రమే. తెలుగు మేల్ ఆర్టిస్టుల్లో బాలీవుడ్ లో ఎవరూ సరిగా నిలబడలేకపోయారు. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి, తర్వాత రామ్ చరణ్, లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కూడా ఉత్తరాది ప్రేక్షకులని ఆకట్టుకోలేక ఇక్కడే ఆగిపోయారు.

అప్పట్లో నాగార్జున కొన్ని హిందీ సినిమాల్లో కనిపించాడు కానీ వాటితో పెద్దగా ఒరిగిందేమీ లేదని చెప్పాలి. కానీ ఇప్పుడు మరో తెలుగు నటుడు ఆ కలని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఓ సూపర్ ఎఫర్ట్ తో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఇప్పటి వరకూ ఇలా ఎంట్రీ ఇచ్చిన వాళ్లకు భిన్నంగా.. 'బాఘీ' మూవీతో విలన్ గా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మూవీ రిలీజ్ ఇవాళే. ఇప్పటికే టీజర్ లు, ట్రైలర్ లతో యాక్షన్ పార్ట్ ను ఇరగదీసేయడమే కాదు.. స్పెషల్ గా సుధీర్ బాబు పైనే ఓ టీజర్ కూడా ఇచ్చారు. మొత్తానికి రికార్డు కొట్టాడు.

English summary

Is Sudheer Babu will success in Bollywood. Is Sudheer Babu will get success with Bhaaghi movie.