టిడిపి తో కాంగ్రెస్ పొత్తా ?

Is TDP To Join Hands With Congress

01:00 PM ON 24th November, 2015 By Mirchi Vilas

Is TDP To Join Hands With Congress

అవును మరి ... తెలంగాణాలో 2019ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమట. ఇందుకోసం టిడిపితో సహా అన్ని పార్టీలతో కాంగ్రెస్ పొత్తు అట. ఇలా చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ కాంగ్రెస్ నేతే. అదేనండి .... కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఇవి. ఓ వైపు వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో దూసుకువెళ్తుంటే కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈవిధంగా స్పందించారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు టీడీపీతో సహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని ఆయన అనేసారు. వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలంటే తెలంగాణలో వామపక్షాలతో పాటు టీడీపీని సైతం కలుపుకుని పోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ విషయంలో మొదటి నుంచి స్పష్టమైన వైఖరితో ముందుకువెళ్తున్న గుత్తా ఒక్కసారి చేసిన వ్యాఖ్యలు తెలంగాణాలో నే కాదు ఎపిలోనూ సంచలనం రేపుతున్నాయి.

English summary

Congress MP Gutta Sukhendhar Reddy says that congress will win defenitely in 2019 elections. He says that congress party is going to join hands with all political parties to defeat TRS party in 2019 elections