ఓ పక్క రంజాన్ ... మరో పక్క రక్తపాతానికి 'ఉగ్ర' ప్లాన్!

IS Terrorists Planned For Bomb Blast on Ramzan In Hyderabad

10:35 AM ON 6th July, 2016 By Mirchi Vilas

IS Terrorists Planned For Bomb Blast on Ramzan In Hyderabad

ఉగ్రవాదం ఏరూపంలో ఎప్పుడు ఎలా జడలు విప్పుతుందో తెలీని రోజులివి అయితే రంజాన్ వేళ భారీ ఎత్తున విధ్వంసం సృష్టించడం ద్వారా రక్తపాతం కోసం ప్లాన్ చేసిన వైనాన్ని పోలీసుల సోదాల్లో గుర్తించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అందించిన పకడ్బందీ సమాచారంతో మంగళవారం హైదరాబాద్లో మరోసారి సోదాలు నిర్వహించారు. ఫలితంగా పాతబస్తీలోని తలాబ్ కట్ట, బార్కాస్ ప్రాంతాల్లో చేసిన ఈ సోదాలలో 17 లైవ్ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రంజాన్ వేళ రక్తపాతం సృష్టించడమే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్లాన్ గా భావిస్తున్నారు.

వారం రోజుల క్రితమే ఎన్ఐఏ, హైదరాబాద్ పోలీసులు కలిసి సంయుక్తంగా పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంత జరిగినా ఇప్పటికీ లైవ్ పేలుడు పదార్థాలను సిద్ధంగా ఉంచుకున్నారంటే.. రాబోయే రెండు మూడు రోజుల్లోనే విధ్వంసానికి పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కుట్ర ఇందులో నలుగురు తీవ్రవాదులు కీలక బాధ్యతలు నిర్వర్తించినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:ఈవిడ బరువు 128 కేజీలు.. కాలు జారి భర్త పై పడింది.. ఏమైందో తెలుసా?

ఇవి కూడా చదవండి:కొడుకును వెయ్యికి అమ్మేసాడు.. ఎందుకో తెలుసా?

English summary

NIA and Hyderabad Together made a search operation in Hyderabad and recovered bobm and arrested some people and now yesterday police were arrested some people again and recovered some bomb material from them.`