జంట అరటిపళ్ళు తింటే కవలలు పుట్టడం నిజామా కాదా ?

Is Twin Bananas Can Lead To Have Twins

11:45 AM ON 14th December, 2016 By Mirchi Vilas

Is Twin Bananas Can Lead To Have Twins

కొన్ని నమ్మకాలు నిజమవుతాయి. మరికొన్ని నిజంకావు. కొన్ని కొంచెం అటూ ఇటూ జరుగుతూ ఉంటాయి. నమ్మకాలు నిజమైతే ఇంక అది సెంటిమెంట్ గా మారిపోతుంది. ఇది కూడా అలాంటిదే. కడుపుతో ఉన్నవాళ్లు, జంట అరటిపండ్లను తింటే కవలలు పుడతారనే నమ్మకాన్ని కేవలం ఇండియన్సే కాదు….ఫిలిప్పైన్స్ దేశీయులు కూడా బలంగా నమ్ముతారు. ప్రెగ్నెంట్ లేడి…. తన గర్భకాలంలో తొలి మూడు నెలల్లో ఈ జంట అరటి పండ్లను తింటే వారికి ఖచ్చితంగా కవలలే పుడతారనే నమ్మకం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే సైంటిఫిక్ గా ఇది నిరూపితం కానప్పటికీ…దీనిని బలపరిచేందుకు మాత్రం ఓ సైన్స్ లాజిక్ మాత్రం పనికొస్తుంది.

1/5 Pages

అరటిపండు పోటాషియమ్ గని ...

సాధారణంగా అరటి పండును పోటాషియమ్ గని అంటారు. ఒక్క అరటి పండు తింటే….ఒక రోజులో మన శరీరానికి కావాల్సిన 20% పొటాషియమ్ లభిస్తుంది. ఇక గర్భిణీలకు పొటాషియమ్ అవసరమే కానీ పోటాషియమ్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. ఒక్క అరటిపండు తింటేనే 450 మి.గ్రాముల పొటాషియమ్ లభిస్తుంది. అదే జంట అరటి పండైతే…..900MG పొటాషియమ్….అంటే ఒక రోజులో మనకు కావాల్సిన పొటాషియమ్ లో కేవలం అరటిపండు నుండే 40% తీసుకున్నట్టు లెక్క…ఇతర ఆహార పదార్థాల ద్వారా కూడా పెద్ద మొత్తంలోనే పొటాషియం అందుతుంది. ఇది గర్భిణీ మహిళల మీద, అలాగే వాళ్లకు పుట్టబోయే పిల్లలపై కూడా అధిక ప్రభావాన్ని చూపుతుంది.

English summary

A Myth was going viral over the past years that when a pregnant lady eats Twin Bananas then it may cause to the birth of Twins. Not only Indians believe this but also in other countries also believe this Myth.