జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్యాయత్నానికి విశాల్ కారణమా?

Is Vishal is reason for junior artist suicide

11:24 AM ON 25th August, 2016 By Mirchi Vilas

Is Vishal is reason for junior artist suicide

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనను నడిగర్ సంఘం ఆదుకోలేదన్న ఆవేదనతో సెల్వరాజ్ అనే జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కోలీవుడ్ లో కలకలం రేపింది. అయితే ఆత్మహత్యయత్నానికి ముందు ఆయన నటుడు విశాల్ కి రాసిన లేఖ వివాదంగా మారింది. వివరాల్లోకి వెళితే.. వ్యాసర్పాడి ఎంకేబీ నగర్ కు చెందిన జూనియర్ ఆర్టిస్టు సెల్వరాజ్ నడిగర్ సంఘం సభ్యుడిగా ఉన్నాడు. సుమారు 40 సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన అతనికి పారితోషికం సక్రమంగా అందలేదని, అందువల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని సహ జూనియర్ ఆరిస్టులు వాదన. మరోవైపు సెల్వరాజ్, ఆయన భార్య శశికళతో ఏర్పడిన విభేదాల కారణంగా ఆ దంపతులు విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి సెల్వరాజ్ ఆత్మహత్యకు యత్నించారు. అతని నోటి నుంచి నురగ రావడం గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. చికిత్సలందించిన వైద్యులు, సెల్వరాజ్ ప్రాణానికి ప్రమాదం లేదని తేల్చారు. ఇదిలా ఉండగా, సెల్వరాజ్ ఆత్మహత్యాయత్నం సమాచారం తెలిసి జూనియర్ ఆర్టిస్టులు స్నేక్ రవి, ప్రవీణ్ తదితరులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నడిగర్ సంఘం నిర్వాహకుల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విశాల్ మంటగలిపారని జూనియర్ ఆర్టిస్టులు ఆరోపించారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాటి కళాకారులను ఆదుకుంటామని హామీ ఇవ్వబట్టే తాము విశాల్ టీమ్ ను గెలిపించామన్నారు. సెల్వరాజ్ లాగే వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు ఆర్థ్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, ఇప్పటికైనా నడిగర్ సంఘం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.

English summary

Is Vishal is reason for junior artist suicide