మోడీకి  బెదిరింపు లేఖ

IS Warning Letter To Narendra Modi

05:15 PM ON 19th January, 2016 By Mirchi Vilas

IS Warning Letter To Narendra Modi

బెదిరింపులు రావడం, ఇందుకోసం లేఖలు రాయడం చూస్తూనే వుంటాం. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ , రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్‌లను చంపుతామంటూ పోస్ట్ కార్డ్ వచ్చిందట. ఇది గోవా రాష్ట్ర సెక్రటేరియట్‌కు గత వారం చేరింది. అయితే ఈ బెదిరింపు లేఖ ఎవరు పంపారో తెలీదు. పంపినవారి గురించి ఎలాంటి చిరునామా లేకుండా పోస్టు కార్డు మీద రాసిన ఈ లేఖలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ సంతకం ఉన్నట్లు మాత్రం పోలీసుల కధనం. ఐఎస్‌ ఉగ్రవాదు లు పంపినట్లు భావిస్తున్న ఈ బెదిరింపు లేఖను గోవా పోలీసులు ఆ రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపించి, అందరినీ అప్రమత్తం చేశారు. కేసు దర్యాప్తును యాంటి టెర్రరిస్ట్‌ స్వా్కడ్‌కు(ఏటీఎస్‌) అప్పగించారు.

గతవారం వచ్చిన ఈ బెదిరింపు లేఖపై చర్యలు తీసుకుంటున్నట్లు గోవా సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడిస్తూ, రాష్ట్ర పోలీసు యంత్రాంగంలోని అన్ని ఏజెన్సీలూ ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నాయని త్వరలోనే బెదిరింపు లేఖ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటామనివివరించారు. పోస్ట్‌కార్డు కింద ఐఎస్‌ఐఎస్‌ అని రాసి ఉన్నట్లు తెలిపారు. ఇక అదే లేఖలో గోవధ నిషేధంపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు.

English summary

A letter came from unknown person that giving warning to India Prime Minister Narendra Modi And Defence Minister of India Manohar Parrikar. In that they warned them that they will kill them