జుకర్‌బర్గ్‌ పేదోడు అవుతాడా

Is ZuckerBerg To Become Poor

12:49 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Is ZuckerBerg To Become Poor

ఫేస్‌బుక్‌లోని తనకున్న 99శాతం షేర్లను సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్నట్లు ప్రకటించిన ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌జుకర్గ్‌ బర్గ్‌ యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసాడు. తనకు కూతురు పుట్టిన సందర్భంగా యావత్‌ ప్రపంచం సంక్షేమం కోసం తన సంపదను వెచ్చించనున్నట్లు ప్రకటించాడు. జుకర్‌బర్గ్‌ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాలోని ఎంతో మంది బిలియనీర్లు హర్షాన్ని వ్యక్తం చేసారు. అలాగే కేవలం పన్నులు ఎగ్గొట్టడం కోసం మాత్రమే వేసిన ఎత్తుగడగా కొంత మంది విమర్శలు మొదలుపెట్టారు. ఆ విమర్శలను తిప్పిగొడుతూ తాను సేవాకార్యక్రమాలకు వెచ్చించే మొత్తానికి కూడా పన్నులు చెల్లించనున్నట్లు జుకర్‌బర్గ్‌ స్పష్టం చేసి విమర్శలను తిప్పికొట్టారు. కానీ ఇప్పుడు ఒక్కటే ప్రశ్న అందరి ముందూ మెదులుతుంది. తనకున్న సంపదలో 99శాతం షేర్లను దానం చేసేస్తే జుకర్‌బర్గ్‌ పేదోడు అయిపోతాడా అని. అలా జరిగే ప్రసక్తే లేదని తేల్చుతున్నారు కొందరు.

జుకర్‌బర్గ్‌ 99శాతం షేర్లను దానం చేసినప్పటికీ తన సంపదంతా ఒక్క సారిగా హరించిపోదు. ఎందుకంటే తానేమీ 45బిలియన్లను ఒకేసారి దానం రూపంలో పంచిపెట్టేయడం లేదు. తన జీవిత కాలంలో ఈ 99శాతం షేర్లను పంచిపెడతాడట. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఒక ప్రత్యేక సంస్థను నెలకొల్పనున్న మార్క్‌ కొన్ని ప్రత్యేక విధివిధానాల ద్వారా మాత్రమే సదరు డబ్బును ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించునున్నారు. అంటే కేవలం సేవా కార్యక్రమాలకు మాత్రమే వెచ్చించడం కాకుండా స్వచ్ఛంద వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టేందుకు, రాజకీయ విరాళాలు ఇచ్చేందుకు, ఇతర సేవా కార్యక్రమాలకు ఉపయోగపడేలా కంపెనీ విధివిధానాలను రూపొందించే పనిలో ఉన్నాడు జుకర్‌బర్గ్‌.

ఒకవేళ జుకర్‌బర్గ్‌ తను చెప్పినట్లు 99శాతం షేర్లను సేవాకార్యక్రమాలకు ఇచ్చినప్పటికీ, ఒక్క శాతం షేర్లకు సుమారు 450మిలియన్‌ డాలర్ల విలువ ఉంటుందన్నమాట. అలాగే ఇప్పటికే మార్క్‌ పేరిట ఉన్న స్థిరాస్తులు, డబ్బుతో కలిపి చూస్తే జుకర్‌బర్గ్‌ ఏమీ పేదోడు అయిపోడు కూడా. భవిష్యత్తులో ఫేస్‌బుక్‌ షేర్ల విలువల మరింత పెరిగే పక్షంలో జుకర్‌బర్గ్‌ తన ఒక్క శాతం షేర్లతోనే బిలియనీర్‌గా కొనసాగుతాడన్న మాట.


English summary

Facebook Ceo and co-founder mark zucker berg said that he is going to donated his 99 percent of facebook shares . Recently zuckerberg became daddy on that occassion he made this statement